Share News

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు..

ABN , Publish Date - Feb 11 , 2026 | 08:32 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు చోటుచేసుకున్నాయి..

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు..
Telangana IAS Officers Transfers

హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను (Telangana IAS Officers Transfers) బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదలైన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. పలు ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ బదిలీలు రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులకు దారి తీసే అవకాశం ఉంది.


బదిలీ అయిన అధికారులు వీరే..

తెలంగాణ ప్రభుత్వం బుధవారం పలువురు ఐఏఎస్ అధికారులని బదిలీ చేసింది. సింగరేణి సీఎండీగా డా.జ్యోతి బుద్ధప్రకాశ్‌ని నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ కొనసాగనున్నారు. TGRAC డీజీగా సందీప్‌కుమార్ సుల్తానియాని నియమించింది. పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా కాత్యాయనీ దేవిని నియమించింది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ JMDగా కాత్యాయనికి అదనపు బాధ్యతలు కేటాయించింది. HMWSSB జాయింట్ ఎండీగా మయాంక్ మిట్టల్, ఇండస్ట్రీస్ & కామర్స్ స్పెషల్ సీఎస్‌గా రఘురాంశర్మలకు బాధ్యతలను అప్పగించింది. అలాగే, మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో రఘురాంశర్మ కొనసాగనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పాడి గేదెల పేరుతో భారీ మోసం.. పశువులను ఇంటికే పంపిస్తామంటూ..

రేవంత్‌రెడ్డి పాలనలో.. బస్సు తప్ప అన్నీ తుస్సే.. హరీశ్‌రావు సెటైర్లు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 09:31 AM