వెల్‌కమ్ టూ కేరళ..
ABN , Publish Date - Feb 11 , 2026 | 09:19 AM
నగరంలో కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్‌లో రోడ్ షో నిర్వహించారు. ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు.
నగరవాసులను ఆహ్వానించిన ఆ రాష్ట్ర పర్యాటక శాఖ
హైదరాబాద్ సిటీ: నగరంలో కేరళ టూరిజం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఓ హోటల్‌లో రోడ్ షో నిర్వహించారు. ట్రావెల్ నౌ, పోస్ట్ లేటర్ పేరిట వినూత్న ప్రచారం నిర్వహించారు. రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో కేరళ(Kerala) పర్యాటకాన్ని సందర్శించాలని నిర్వాహకులు ఆహ్వానించారు. తమ రాష్ట్రంలోని బీచ్‌లు, హిల్‌స్టేషన్లు, హౌస్‌బోట్లు, బ్యాక్‌వాటర్, రిసార్టులు, హోమ్‌స్టేలు, ఆయుర్వేద ఆధారిత వెల్‌నెస్ సొల్యూషన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ నృత్యాలతో కళాకారులు అలరించారు.

ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News
