బరువెంతైనా.. బలమే ఆయుధంగా.. వివిధ కేజీల్లో భారీ బరువులను ఎత్తి మహిళా క్రీడాకారిణులు సత్తా చాటారు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఆక్వా రంగానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తోందని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో రూ.55 కోట్లతో నిర్మించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.
మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటు న్నాయి.మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సామాన్యులపై ధరల భారం పడుతోంది.
ఎక్కువగా నులిపురుగుల సమస్య చిన్న పిల్లల్లో ఉంటుంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో చేతి వేళ్ల ద్వారా క్రిములు మనం తినే ఆహారంతో పాటు కడుపులోకి వెళ్లి నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి.
గోదావరి నది ఎగువ భాగంలో కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరద భారీగా వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం నరసాపురం స్టేషన్‌లో రెండు ఫిట్‌లైన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి శిథిలావస్థకు చేరింది. ఈ కారణంగా నిర్వహణ పనులన్నీ ఒక్క ఫిట్‌లైన్ మీదే చేస్తున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని ఎద్దేవా చేశారు.
గోదావరి వరద క్రమేణ పెరు గుతోంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 25 అడు గులు ఉన్న నీటిమట్టం రాత్రి ఎనిమిది గంటలకు 31 అడుగులకు చేరగా ఆదివారం ఉదయానికి 38 అడుగులకు చేరే అవకాశం ఉంది.
పదోతరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతర కోర్సుల చదివి నిరుద్యోగులుగా సతమతం అవుతున్న యువతీ యువకులకు కౌశలం పథకంలో ఉద్యోగాల కల్పన దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది.