Share News

కదం తొక్కారు..

ABN , Publish Date - Feb 13 , 2026 | 12:52 AM

లేబర్‌ కోడ్‌ల ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక, కర్షక లోకం కదం తొక్కింది. బల వం తంగా కార్మిక చట్టాలను రద్దు చేసి.. లేబర్‌ కోడ్‌లను కార్మికుల పొట్టలను కొట్టేందుకు కేంద్రం చర్యలకు పూనుకొందని వివిధ కార్మిక సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

కదం తొక్కారు..
ఏలూరు ఆర్‌ఆర్‌పేటలో ర్యాలీ నిర్వహిస్తున్న కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు

జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు

బ్యాంకులు, ఎల్‌ఐసీ కార్యాలయాలు మూసివేత

ఏలూరులో భారీ ర్యాలీ.. కలెక్టరేట్‌ వద్ద ఎన్జీవోల సంఘీభావం

ఏలూరు/ఏలూరు కార్పొరేషన్‌/ఏలూరు రూ రల్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): లేబర్‌ కోడ్‌ల ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక, కర్షక లోకం కదం తొక్కింది. బల వం తంగా కార్మిక చట్టాలను రద్దు చేసి.. లేబర్‌ కోడ్‌లను కార్మికుల పొట్టలను కొట్టేందుకు కేంద్రం చర్యలకు పూనుకొందని వివిధ కార్మిక సంఘాల నేతలు ధ్వజమెత్తారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఎర్రజెండాల రెపరెపలతో కార్మికుల నినాదాలతో హోరెత్తాయి. సీఐటీ యూ ఆధ్వర్యంలో ఏలూరు జూట్‌మిల్లు మీదు గా కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ చేయగా, ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఆర్‌ఆర్‌పేట పార్కు వరకు కార్మిక, కర్షక,రైతు, కూలీలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు చేపట్టారు. కార్మిక సంఘాల నాయకులు, సీపీ ఐ, సీపీఎం, ఇఫ్టూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీ, సీఐటీయూ తదితర ప్రజా సంఘా లకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాలొ న్నారు. కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఉమామహేశ్వరరావు మాట్లాడు తూ మతోన్మాద ఏజెండాలో భాగంగా కేంద్రం ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా వీజీ రామ్‌ జీ పథకంను తీసుకొచ్చిందన్నారు. లేబర్‌ కోడ్‌లు అమలు చేయడమంటే కార్మికుల మెడ కు ఉరితాడు బిగించడమేనన్నారు. కార్మికుల పట్ల కక్ష కట్టి మోదీ సర్కారు ఆదానీ వంటి కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నారన్నారు. సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్‌, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీని వాస్‌, ప్రధాన కార్యదర్శి నెరుసు రామారావు, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమా ర్‌ మాట్లాడుతూ ఐక్య పోరాటాలు ద్వారా కార్మికులు ఉద్యోగులుకు నష్టం చేసే లేబర్‌ కోడ్స్‌ రద్దు అయ్యే వరకు పోరాడ తామన్నారు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో కార్మికులు మెడకు ఉరి తాడుతో నిరసన తెలిపారు. కాగా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్‌రావు, వైసీపీ నాయకుడు మామిళ్ళపల్లి జయప్రకాష్‌, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ య్యచౌదరి, తదితరులు పాల్గొని కార్మికుల నిరసనకు సంఘీ భావం తెలిపారు.

నిలిచిన రూ.600 కోట్ల లావాదేవీలు

సమ్మె కారణంగా బ్యాంకుల సేవలు స్తంభిం చాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో 600 కోట్ల మేర లావాదేవీలు నిలిచి పోయాయి. బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీల్లో పాల్గొన్నారు. ఎల్‌ఐసీ బ్రాంచ్‌లు మూతపడడంతో పాలసీ దారులు ఇబ్బందులు పడ్డారు. కార్మిక సంఘా ల సమ్మెకు సంఘీభావంగా జిల్లా ఎన్జీవో సంఘం ఆఽధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు.

Updated Date - Feb 13 , 2026 | 12:52 AM