మా భూములు ఇవ్వం
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:32 AM
‘మా భూములు ఇవ్వం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకుంటాం’.. అంటూ కొయ్యలగూడెం మండల ప్రజలు గర్జించారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణం నిలిపివేయాలని బలవంతపు భూసేకరణను విరమించా లని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోగిగూడెం, మంగపతిదేవి పేట, బర్కిత్ నగర్, రేగులకుంట, ఊట్లగూడెం గ్రామాల రైతులు, ప్రజ లు ధర్నా నిర్వహించారు.
నేవీ డిపో నిర్మాణం ఉపసంహరించాలి
కలెక్టరేట్ వద్ద గర్జించిన కొయ్యలగూడెం మండల రైతులు
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ‘మా భూములు ఇవ్వం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకుంటాం’.. అంటూ కొయ్యలగూడెం మండల ప్రజలు గర్జించారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణం నిలిపివేయాలని బలవంతపు భూసేకరణను విరమించా లని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద భోగిగూడెం, మంగపతిదేవి పేట, బర్కిత్ నగర్, రేగులకుంట, ఊట్లగూడెం గ్రామాల రైతులు, ప్రజ లు ధర్నా నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, పలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. వనజ, కృష్ణ చైతన్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య మాట్లాడుతూ భూములు ఇవ్వం అని తేల్చి చెబుతున్నా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడం పాలకుల నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణ తక్షణం నిలపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్విని కలిసి వినతి పత్రం అందజేశారు. రైతులు సంసాని కిశోర్, ఇళ్ళ శ్రీరామ మూర్తి, బలుసు నాగేశ్వరరావు, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.