బడ్జెట్ ఆశలు
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:30 AM
సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం గతేడాదే అన్ని పథకాలను గాడిన పెట్టింది. ప్రధానంగా నిధుల కొరతను అధిగమిస్తూ అన్ని శాఖలకు జవసత్వాలు కల్పించే దిశగానే అడుగులు వేస్తోంది. కేంద్రం సాయంతో పాటు.. రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుదల అడుగులు వేస్తూనే.. అందరికి మొఖాల్లో వెలుగులు పంచేలా బడ్జెట్‌కు సిద్ధమైంది.
నేడు రాష్ట్ర బడ్జెట్
పుష్కరాలకు కేటాయింపులుంటాయా..
పోలవరం పర్యాటకానికి నిధులిస్తారా?
డెల్టా ఆధునికీకరణ బిల్లుల మాటేమిటి..
చింతలపూడి చింత తీర్చుతారా..
కోకో సిటీ షురూ అయ్యేనా..
కొత్త ఉపాధి నిధులెంతో..
బోలెడన్ని ఆశలు పెట్టుకున్న జిల్లావాసులు
ఏలూరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం గతేడాదే అన్ని పథకాలను గాడిన పెట్టింది. ప్రధానంగా నిధుల కొరతను అధిగమిస్తూ అన్ని శాఖలకు జవసత్వాలు కల్పించే దిశగానే అడుగులు వేస్తోంది. కేంద్రం సాయంతో పాటు.. రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుదల అడుగులు వేస్తూనే.. అందరికి మొఖాల్లో వెలుగులు పంచేలా బడ్జెట్‌కు సిద్ధమైంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేడు శాసనసభలో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జిల్లా యంత్రాంగం..పాలక వర్గాలు, ప్రజా ప్రతినిఽధులు బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రధానంగా గోదావరి పుష్కరాలకు భారీగా నిధులుంటా యని భావిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాలకు ముందే పూర్తి చేయడంతో పాటు ఇక్కడ పర్యాటకంగా మరిన్ని వసతులు కల్పించాలని సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలో పోలవరానికి నిధుల కేటాయింపు భారీగానే ఉండే అవకాశం ఉంది. మరోవైపు డెల్టా ఆధునికీకరణకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి అదనపు నిధులు కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉద్యాన పంటల్లో ఏలూరు జిల్లాలో కోకో సిటీ చేయడానికి బడ్జెట్‌లో కేటాయింపులా ఉంటాయా? అన్న ఆసక్తి నెలకొంది.
పోలవరంలో టూరిజానికి అడుగులు పడేనా..
పోలవరం ప్రాజెక్టును కేంద్రం సాయంతో ఎట్టి పరిస్థితు ల్లోనైనా వచ్చే ఏడాది పుష్కరాలు నాటికి పూర్తి చేయాలని సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు. అయితే పోలవరం పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే 15.25 ఎకరాలను రిసార్ట్స్ నిర్మాణానికి రాష్ట్రం కేటాయిం చింది. మరోవైపు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేస్తామని సీఎం ప్రకటించారు.ఈ దరిమిలా పర్యాటకులకు స్వర్గధామంగా పోలవరం తీర్చిదిద్దాలంటే కనీసం రూ.500 కోట్లు అయినా కేటాయించాల్సి ఉంది.
పుష్కరాలకు నిధులు ఎంతిస్తారో..?
వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలకు జిల్లా సమాయత్తం కావాల్సి ఉంది. గోదావరి పరీవాహక ప్రాం తంలోనే పలు మండలాల్లో 44 స్నానఘాట్‌లు ఏర్పాటు.. టెంపుల్ టూరిజం, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టా ల్సి ఉంది. లక్షలాది మంది భక్తులు ఈ సారి పోటెత్తను న్నారు. దీంతో బడ్జెట్‌లో పుష్కర నిధులు భారీగా నిధులు విదిలింపు ఉంటుందా? అన్న ఆసక్తి నెలకొంది.
కొల్లేరు రెగ్యులేటర్లు మాటేమిటి..
కొల్లేరు ప్రక్షాళనలో భాగంగా పలుచోట్ల రెగ్యులేటర్లు నిర్మాణం చేయాలని దశాబ్దాల క్రితం నుంచి ప్రతిపాదన లున్నాయి. అయితే డ్రెయిన్ల ప్రక్షాళనకు నిధులేమి ఆటం కంగా ఉంది. ప్రధానంగా రూ.200 కోట్ల పైబడి ప్రతి పాదనలు జలవనరులశాఖ నుంచి వెళ్లాయి. ఈ నిధులపై కొల్లేరు వాసులు ఆశలు పెట్టుకుంటున్నారు.
కోకో సిటీ ప్రతిపాదన ఏం చేస్తారో?
జిల్లాలో కోకో విరివిగా సాగవుతోంది. ఇటీవల కోకో పండించే రైతులతో కలిసి కోకో కంక్లైన్ నిర్వహించారు. జిల్లాలో 200 ఎకరాల్లో కోకో సిటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కోకో ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాల్సి ఉంటుంది. దీనికి కనీసం ఈ బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో ? అన్న ఆసక్తి నెలకొంది. ఇది ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టు కావడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.
డెల్టా ఆధునికీకరణ బిల్లులు పెండింగే..
గత బడ్జెట్‌లో గోదావరి డెల్టా ఆధునికీకరణకు రూ.222 కోట్లు కేటాయించారు. తీరా పనులు ప్రారంభించినప్పటికి ఇంకా రూ.45 కోట్ల బిల్లుల పెండింగ్‌లో ఉన్నాయి. రూ.110 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. అధికారులు అంచనాల ప్రకారం రూ.547 కోట్లతో ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు తాజాగా పంపినట్టు సమాచారం. దీంతో ఈ బడ్జెట్‌లో నిధుల పెంపు ఉంటుందని ఆశిస్తున్నారు.
వీజీ రామ్ జీ పథకానికి నిధులెలా..
ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా వీజీ రామ్ జీ పథకానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నే పథ్యంలో 40శాతం రాష్ట్రం భరిస్తే కేంద్రం 60 శాతం నిధులు విదిలింపు ఉంటుంది. 100 రోజుల పనిదినాలను 125 పెంచాలని చూస్తున్నప్పటికి రాష్ట్ర భరించే నిధులు వాటాపైనే మన జిల్లాకు కేటాయింపులుంటాయి. మన జిల్లాకు ఈ పథ కం ఎంతో కీలకం. కేటాయింపులు ఏ రీతిన ఉంటాయో అన్న ఆసక్తి నెలకొంది.