కొత్త పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:03 AM
పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలని బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. అధికారులను ఆదేశించారు.
పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్
భీమవరంటౌన్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి నూతన పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనకు నిర్ణీత సమయంలోనే అన్ని అనుమతులు జారీ చెయ్యాలని బ్యాంకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి, ఇన్వెస్టర్లతో సమావేశం నిర్వ హించారు. పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎన్‌ఆర్‌డీసీ ఆధ్వర్యంలో యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చే యువ పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీ, మిష నరీ, ముడిసరుకు , మార్కెటింగ్, బ్యాంకు రుణాలు, వివిధ అనుమతులపై అవ గాహన కల్పించేందుకు మార్చి నెలలో వర్క్‌షాప్ నిర్వ హణకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా పరిశ్రమల శాఖ అధి కారిని ఆదేశించారు.
తాగునీటి కొరత రాకూడదు
రానున్న వేసవిలో పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి తాగునీటి కొరత లేకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి మునిసిపాలిటీల వారీగా సమీక్షించారు. వేసవిలో సురక్షితమైన తాగునీరు అందించేందుకు మునిసిపల్ కమిషనర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా లభించే సేవలపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచార కార్య క్రమాన్ని చేపట్టాలన్నారు. పన్నుల వసూళ్లలో లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
స్వమిత్వ సర్వే వేగవంతం చెయ్యాలి : జేసీ
జిల్లాలో ఫేజ్–2 స్వ మిత్వ సర్వే ప్రక్రి యను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయా లని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. స్వమిత్వ ప్రోగ్రెస్‌పై జిల్లాలోని డిప్యూటీ ఎంపీడీ వోలు, పంచాయతీ కార్య దర్శులు, స్వమిత్వ కేటాయించిన సర్వేయర్లతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఫేజ్–2 స్వమిత్వ సర్వే జరుగుచున్న 197 గ్రామాలుగాను చివరి దశకు చేరుకున్న 54 గ్రామాలు సర్వే ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదే శిం చారు. భూ యజమానుల హక్కులను స్పష్టంగా నమోదు చేయడం ఈ కార్య క్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.