Share News

అభివృద్ధి.. సంక్షేమం!

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:17 AM

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది. గతేడాది పథకాలను గాడిన పెట్టారు.

అభివృద్ధి.. సంక్షేమం!

ఏలూరు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంది. గతేడాది పథకాలను గాడిన పెట్టారు. ఈసారి కేటాయింపులతో పథకాలను మరింత పరుగులు పెట్టించనున్నారు. రెండంకెల వృద్ధి దిశగానే అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లుగానే కేటాయింపుల్లోను ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటిం ది. పోలవరం పరుగులు పెట్టించడంతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మోక్షం కల్పించేలా కేటాయింపులను పెంచారు. మధ్యాహ్నం భోజనం, రోడ్లు, గృహ నిర్మా ణాలకు కేటాయింపులు పెంపుతో పేద వర్గాలకు ఊరటనిచ్చే అంశాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇక పంచాయతీలకు, పురాల అభివృద్ధ్దికి అడుగులు వేయడానికి నిధుల పెంపుదల ఉపకరించనుంది.

కేంద్రం సాయంతో పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పుష్కరాలకు ముందుగానే పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి అన్ని పనులన్నీ గాడిన పెట్టే దిశగా రూ.6,105 కోట్ల ఖర్చు చేయాలని నిర్ణయించారు. కేంద్రం రూ.3302 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో చూపించినప్పటికి అంచనాల్లో మనకు రావాల్సిన మొత్తాలను రాబట్టడానికి పనులు వేగం పెంచనున్నారు.

చింతలపూడికి రూ.430 కోట్లు

మెట్ట మండలాలకు సాగు,తాగునీరు అందించేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాదిలోనే గాడిన పెట్టే అవకాశాలు న్నా యి. గతేడాది బడ్జెట్‌లో రూ.360 కోట్లను కేటాయించారు. అవి కొంత ఖర్చు పెట్టలేక పోయినప్పటికీ.. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన వినతులు, డిమాండ్లతో ఈసారి రూ.430 కోట్ల కేటాయింపులతో పరుగులు పెట్టించడం ఖాయంగా కనిపి స్తోంది. కోర్టు కేసు సత్వరం పరిష్కరించు కుని కాల్వలు.. కల్వర్టులు ఇతర పనులు చేపట్టనున్నారు.

డెల్టా ఆధునికీకరణకు రూ.200 కోట్లు

గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో ఈసారి కూడా బడ్జెట్‌లో కేవలం రూ.200 కోట్లు కేటాయింపులే చేపట్టారు. గత బడ్జెట్‌లో రూ.222 కోట్లు కేటాయింపు చేయగా, పనులు పురోగతిలో వేగం మందగించడంతో నిధులు తగ్గించినట్టు సమాచారం. మొత్తం మీద ఈ సీజన్‌లోను డెల్టా ఆధునికీకరణ పనులు పట్టాలెక్కే అవకాశం ఉంది.

రోడ్లు.. ఇళ్లకు కేటాయింపులు

రోడ్లు, గృహ నిర్మాణాలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరి గాయి. రోడ్ల మరమ్మతులను ఇప్పటికే చేపట్టగా ఎన్‌డీబీ ప్లాన్‌, నాబార్డు కింద రాబోయే కాలంలో నిధులు విదిలింపు జరగనుంది. జిల్లాలో ఇప్పటికే రూ.120 కోట్లతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇంకా నిధులు మంజూరు ప్రతిపాదనలు వెళ్లాయి. హౌసింగ్‌కు రూ.5,451 కోట్లు కేటయించారు. రాష్ట్రంలో 25 లక్షల నిర్మాణాలను గాడిన పెట్టే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటికే 97 వేల ఇళ్ల పట్టాలను జారీచేశారు. మరో 4,578 పట్టాల పంపిణీకి సన్నద్దం అవుతున్న దశలో కేంద్ర ప్రాయోజిత పథకాలు పీఎంవై 1, 2 పథకాల కింద సాయం అందనుంది.

సైబర్‌ నేరాలకు చెక్‌

జిల్లాలో ఇటీవల సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోయా యి. ఈ ఉచ్చులో సామాన్యుల నుంచి బడా పారిశ్రామిక వేత్తలు చిక్కుకుని నష్టపోతున్నారు. దీంతో నేరాల అదుపు లో భాగంగా ప్రతి జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌కు బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

గ్రామాలు.. పురాల్లో పనులు షురూ

రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పంచాయతీలకు రూ.22,942 కోట్లు, మునిసిపల్‌ శాఖకు రూ.14,539 కోట్లు కేటాయింపుల ద్వారా గ్రామాల్లో, పురాల్లో వివిధ పథకాల కింద పనులకు మోక్షం కలగనుంది. అమృత్‌ 2.0 పథకం ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడిలో పనులకు ఈ అంచనాలు ఊతం ఇవ్వనున్నాయి. వీటికి అదనంగా యూఐడీఎఫ్‌, ఏఐఐబీ సహకారంతో చేప ట్టే ప్రా జెక్టులన్నింటిని 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో రానున్న కాలంలో పట్టణాల్లో అభివృద్ధికి అడుగులు పడనున్నాయి.

వసతి గృహాలకు మోక్షం

ఇప్పటికే శిఽథిలావస్థలో ఉన్న ఎస్సీ, బీసీ వసతి గృహాలను గాడిన పెట్టిన ప్రభుత్వం ఈసారి కూడా హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు కేటాయింపులను చేపట్టింది. దీంతో ఈ ఏడాది కనీసం 10 కోట్లు అయిన వీటి అభివృద్ధికి విడుదలయ్యే అవకాశాలున్నాయి.

కేంద్ర పథకాలు.. పరుగులే..

కేంద్ర సహకారంతో నడుస్తున్న వీబీ రామ్‌ జీ, జల్‌జీవన్‌ పథకాలకు రాష్ట్రం తరపున ప్రభుత్వ వాటా మొత్తాల విడుదలకు బడ్జెట్‌లో అంచనాలు చూపించారు. దీంతో ఉపాఽధి కింద రానున్న కాలంలో 100 నుంచి 125 రోజుల పనిదినాలు కూలీలకు కల్పించడానికి ఆస్కారం ఏర్పడనుంది. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి 120 లీటర్లు మంచినీటి సరఫరా చేసే పలు పథకాలను గాడిన పెట్టనున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:17 AM