Share News

గుమస్తా ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:34 AM

కొల్లేరు గ్రామా ల్లో కట్టుబాట్లు మధ్య గ్రామ అవసరాలకు వినియోగించే నగదును దుర్వినియోగం చేసి సొంత అవసరాలకు వాడుకున్నాడని ఓ వ్యక్తిని గ్రామ పెద్దలు నిలదీయడంతో మనస్థాపానికి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 గుమస్తా ఆత్మహత్యాయత్నం

కైకలూరు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): కొల్లేరు గ్రామా ల్లో కట్టుబాట్లు మధ్య గ్రామ అవసరాలకు వినియోగించే నగదును దుర్వినియోగం చేసి సొంత అవసరాలకు వాడుకున్నాడని ఓ వ్యక్తిని గ్రామ పెద్దలు నిలదీయడంతో మనస్థాపానికి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలివి.. కొల్లేరు గ్రామాల్లో ఏ పని చేయా లన్నా కట్టుబాట్లు మధ్య గ్రామపెద్దలు చెప్పిన తీర్పునే శిరసావహించి ఆచరిస్తారు. మండలంలోని పందిరిపల్లి గూడెంలో రెండు రోజులుగా గ్రామ అవసరాలకు వినియో గించే నగదును పెద్దల సమక్షంలో లెక్కలు చూశారు. రూ.లక్షలాది సొమ్ము పక్కదారి పట్టినట్టు గుర్తించారు. లెక్కలు చూసే గుమస్తా బలే సత్యనారాయణను ఆ నగదును నువ్వే అపహరించావంటూ నిలదీయడంతో మనస్థాపానికి గురై అతను ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. అతని కుటుంబ సభ్యులు హుటాహుటీన ఏలూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై గ్రామపెద్దలు దీనిపై మరోసారి పంచాయితీ నిర్వ హించనున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై కైకలూరు రూరల్‌ ఎస్సై వి.రాంబాబును వివరణ కోరగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:34 AM