పాతాళంలో గంగ!
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:49 AM
జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు అథఃపాతాళానికి పడిపోయాయి. అధికారిక లెక్కలు.. వాస్తవ అంచనాల ప్రకారం ప్రతిచోట 3 మీటర్ల లోపే భూగర్భ జల మట్టాలు పైకి ఉండాల్సి ఉండగా.. జిల్లా సగటు 18.08 మీట ర్లకు పడిపోయింది.
అడుగంటుతున్న భూగర్భ జలాలు
ప్రమాద ఘంటికలు మోగుతున్న కానరాని దిద్దుబాటు చర్యలు
తొమ్మిది మండలాల్లో 20 మీటర్ల దిగువకు..
జిల్లా సగటు 18.85 మీటర్లు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాద ఘంటిక లను మోగిస్తున్నాయి. గతేడాది డిసెంబరు 17న జరిగి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు గోదావరి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటడమా.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ వెట్రిసెల్విని ఆరా తీశారు. తక్షణం దిద్దుబాటు చర్యలు ఉండాలని.. 16.88 మీటర్ల నుంచి సగటున మూడు మీటర్లకు తగ్గించాలని ఆదేశించారు. అయినా ఇంకా దిద్దుబాటు చర్యలు, ఉపశమన పథకాలకు ప్రణాళిక రూపొందించ కపోవడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు అథఃపాతాళానికి పడిపోయాయి. అధికారిక లెక్కలు.. వాస్తవ అంచనాల ప్రకారం ప్రతిచోట 3 మీటర్ల లోపే భూగర్భ జల మట్టాలు పైకి ఉండాల్సి ఉండగా.. జిల్లా సగటు 18.08 మీట ర్లకు పడిపోయింది. గతేఏడాది నవంబరు నాటికి 16.22 మీటర్లకు మట్టాలు నమోదు కాగా.. జనవరి నెలాఖరు నాటికి వ్యత్యాసం పెరిగి పోయింది. గతేడాది మే నాటికి 18.85 మీటర్లు సగటు మట్టాలు నమోదు కాగా.. మళ్లీ ఈ ఏడాదీ అదే పరిస్థితికి చేరువవుతుందా? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. భూగర్భ జలశాఖ అధికారులు అంచనాల ప్రకారం రెం డు మండలాల్లోనే నీటి మట్టాలు సురక్షిత స్థాయిలో ఉన్నాయి. కైకలూరు, కలిదిండి మండ లాల్లో 3.0 మీటర్ల లోపు మట్టాలు అందుబాటు లో ఉన్నాయి. ఓ మోస్తరు ప్రమా దంలో ఆగిరి పల్లి, భీమడోలు, బుట్టాయగూడెం, చాట్రాయి, జీలుగుమిల్లి, కుక్కునూరు, పోలవరం, వేలేరు పాడుల్లో 3.01 నుంచి 8.0 మీటర్ల లోపు మట్టా లు కలిగి ఉన్నాయి.
తొమ్మిది ప్రాంతాల్లో దిగువకే...
చింతలపూడి, ఏలూరు రూరల్, ఏలూరు అర్బన్, జంగారెడ్డిగూడెం, నిడమర్రు, నూజి వీడు, పెదపాడు, టి.నరసాపురం, ఉంగుటూరు మండలాల్లో 8.01 నుంచి 20 మీటర్ల మధ్య దిగువకు దిగజారాయి.
మెట్ట మండలాల్లో క్లిష్టంగానే..
ప్రధానంగా మెట్ట మండలాల్లో భూగర్భ జలాలు మట్టాలు చాలా ఘోరంగా పడిపో యాయి. దెందులూరు, ద్వారకాతిరుమల, కామ వరపుకోట, కొయ్యలగూడెం, లింగపాలెం, మం డవల్లి, ముదినేపల్లి, ముసునూరు, పెదవేగిల్లో 20 మీటర్ల పైనే పడిపోయాయి. ఇందులో ద్వారకా తిరుమల, కొయ్యలగూడెం మండలాల్లో చాలాకాలం క్రితం డార్క్ ఏరియాలు ప్రకటిం చారు. ఇక్కడ బోర్ల ఏర్పాటుపై నిషేధం అమ లు చేశారు. మళ్లీ ప్రమాద ఘంటికలు మోగే స్థాయిలో భూర్భజలాలు పడిపోవడంపై అధికా రులు పర్యవేక్షణ లేదా ? అన్న ప్రశ్న తలెత్తు తోంది. జిల్లా వ్యాప్తంగా 70 ఫ్రీజో మీట ర్ల ద్వారా నీటి మట్టాలు రీడింగ్‌ను ప్రతీ నెలా అధికారులు నమోదు చేయడం తప్ప.. ఇక ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
నిధులేమితో.. ఉపశమన చర్యల్లేవు
జిల్లాలో భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో నీటి మట్టాలు అడుగంటే ప్రాంతాల్లో తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ శాఖలో నిధులేమితో ఈ రకమైన చర్యలు తీసుకోలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. అనధికారికంగా బోర్ల తవ్వకాలను ఈ శాఖాపరంగా అడ్డుకోవాల్సి ఉంది. మరోవైపు పాడుబడిన చెక్‌డ్యామ్‌ల అభివృద్ధిని చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో పంట కుంటలు, బోర్‌వెల్స్ మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల నీటి మట్టాలు దిగజారతాయి. మరోవైపు వాల్టా చట్టం సరిగ్గా అమలు చేయడం లేదు. మండలాల్లో బోర్లు మంజూరు విషయంలో తహసీల్దార్ అధ్యక్షతన కమిటీ కూర్చొని చర్చించి.. ఆ మేరకు దరఖాస్తుల పరిశీలన చేశాక వ్యవసాయ బోర్ల మంజూరు చేయాలి. ఇవి ఎక్కడ అమలు కావడం లేదు. వేసవి సీజన్‌లోనే కనీసం మండలాల్లో అవసానదశలో ఉన్న చెక్‌డ్యామ్‌లకు మోక్షం కల్పిస్తే.. అడపా దడపా కురిసే వర్షాలకు నీరు భూమిలోకి ఇంకుతుంది.