నూజివీడు నియోజక వర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. గురువారం ఈ దీక్షలను నూజివీడు జేఏసీ గౌరవ అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు, కేడీసీసీ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కొమ్మన నాగేశ్వరరావు ప్రారంభించారు.
డిసెంబరు ఒకటిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల నిమిత్తం ఉంగు టూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం కూటమి నేతలు సన్నాహాక సమావేశం నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాం తాల్లో ఇళ్ల నిర్మాణానికి, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్)– ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి.
తుఫాన్‌లు వీడడం లేదు. ఇటీవల మొంథా.. నిన్న సెన్‌యార్.. నేడు దిత్వా తుఫాన్ ముంచు కొస్తోంది.
సుబ్రహ్మణ్యం మాం పాహి...స్వామినాథ మాం పాహి... అంటూ భక్తులు కావిడిలను ధరించి శ్రీవారి క్షేత్రంలో గురువారం తిరుగాడారు.
మండలంలోని రుస్తుం బాదా పంచాయతీ పరిధిలో ఉన్న మండవారి గరువులో గురువారం హైటె న్షన్ నెలకొంది.
బుట్టాయగూడెం మండల పరిషత్ అధ్యక్షురాలు కారం శాంతిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆర్డీవో ఎంవీ రమణ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 15 మంది ఎంపీటీసీలకు 11 మంది హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినట్టు ఆయన తెలిపారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం, రాజ్యాంగ విలువలపై అవగాహన, తదితర ప్రయోజనాలే లక్ష్యంగా విద్యాశాఖ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ఎంపిక చేసిన బాల ఎమ్మెల్యేలతో బుధవారం అమరావతి లో నమూనా అసెంబ్లీలో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో జిల్లాకు చెందిన ఏడుగురు బాల ఎమ్మెల్యేలు ప్రత్యేకత, వాగ్ధాటిని కనబరిచారు.
చాన్నాళ్ల తర్వాత జిల్లా సమీక్షా కమిటీ సమా వేశం(డీఆర్‌సీ)లో అజెండాపై అర్థవంతమైన చర్చ సాగింది. పొరపాట్లకు తావివ్వకుండా.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా సమ స్యలను పరిష్కారానికి మమైకమై పాటు పడుదామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.
వీధివ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది.