పట్టణాల్లో హ్యాపీ సండే
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:28 AM
పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచి వారికి ఆరోగ్యం..ఆహ్లాదం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీ నుంచి హ్యాపీ సండే కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించింది.
ప్రతీ నెల 2,4 ఆదివారాల్లో..
భీమవరంటౌన్, ఫిబ్రవరి 18 (ఆంధ్రజోతి) : పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచి వారికి ఆరోగ్యం..ఆహ్లాదం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీ నుంచి హ్యాపీ సండే కార్యక్రమం అమలు చేయాలని సంకల్పించింది. ఇప్పటికే మునిసిపల్ కమీషనర్లకు ఉత్తర్వులు అందాయి. ప్రతీనెల 2, 4 ఆదివారాల్లో కార్యక్రమం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు,
ఏం చేస్తారంటే..
యోగా, ధ్యానం, నడక, సైక్లింగ్ తదితర కార్యక్రమాలకు నిర్వహిస్తారు. ఆటలు, కథలు, చిత్ర లేఖనం వంటి పోటీలు నిర్వ హించాలి. స్థానిక ప్రజలను భాగస్వాములు చేయాలి. సామాజిక స్పృహ నింపేవిధంగా మొక్కలు నాటడం, వీధులను శుభ్రం చేయడం, పర్యావరణ పరిరక్షణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆట పాటలతో వివిధ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ప్రతి నెలా 2,4 ఆది వారాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలో నిర్వహించాలి.ఇందుకు అనువైన కూడళ్లు, పార్కులు వంటివి ముందు గానే ఎంపిక చేసుకోవాలి.స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్వహణ వేళల్లో మార్పులు చేసుకునే అవకాశం ఉంది.
గత టీడీపీ హయాంలోనూ ఉంది..
గతంలోనే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభించింది. ప్రతి ఆదివారం ఒక ప్రాంతంలో నిర్వహించారు. మొదట్లో ఉత్సాహంగా సాగినా రానురాను మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. మళ్లీ ఈనెల నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని నాలుగు పట్టణాల్లో ఉన్న కుటుంబాల వివరాలతో ప్రాంతాలను ఎంపిక చెయ్యవలసి ఉంటుంది.