గోదావరి డెల్టాలో లైడార్ సర్వే
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:26 AM
పశ్చిమ డెల్టాలో కాలువ నెట్‌వర్క్ ఏర్పడి 150 ఏళ్లయ్యింది. అప్పట్లో జలరవాణా ఉండేది.
ఇప్పటికే తూర్పులో ముగిసింది.. మరో 20 రోజుల్లో పశ్చిమలో పూర్తి
డ్రైనేజీ వ్యవస్థపై వివరణాత్మక నివేదిక.. రూ.14 కోట్లు మంజూరు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమ డెల్టాలో కాలువ నెట్‌వర్క్ ఏర్పడి 150 ఏళ్లయ్యింది. అప్పట్లో జలరవాణా ఉండేది. దశాబ్దాలు గడచిపోయాయి. డెల్టా స్వరూపం మారింది. కాలువలు పూడుకుపోయాయి. ఇరిగే షన్ స్థలాలు ఆక్రమణలకు, కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. గోదావరిలో పుష్కలంగా నీరున్నా డెల్టా శివారు ప్రాంతాలకు అందడం లేదు. గుప్పెడు నీరు తాగేందుకు వీలు లేకుండా పోయింది. కాలువలు కాలుష్యంగా మారాయి. అధిక వర్షాలు కురిస్తే పొలాలు ముంపు బారిన పడుతున్నాయి. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికీకరణ చేపట్టినా ఫలితం లేకపో యింది. ఫలితంగా కూటమి ప్రభుత్వం వివరణా త్మక సర్వే కోసం చర్యలు తీసుకుంది.
పూర్వ ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని డెల్టా ప్రాంతాన్ని లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) సర్వే ద్వారా అంచనా వేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకు రూ.14 కోట్లు మంజూరు చేసి సర్వేను ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ అనుమతితో ఫ్లైట్ ద్వారా సర్వే చేస్తున్నారు. నాలుగు దశల్లో సర్వే చేపట్టనున్నారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి తొలి దశ సర్వే ప్రారంభించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సర్వే పూర్తిచేశారు. పశ్చిమ డెల్టా పరిధిలో సర్వే నిర్వహిస్తున్నారు. మరో 20 రోజుల్లో ఇది పూర్తవుతుంది. ఆరు నెలలపాటు నాలుగు దశల్లో సర్వే పూర్తయిన తర్వాత ప్రభు త్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ప్రతి చదరపు మీటరు విస్తీర్ణంలో ఉన్న అంశా లను వివరాణాత్మకంగా తెలియనుంది. తద్వారా డెల్టా స్థిరీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభు త్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఆధునికీకరణ పనులు చేపట్టనుంది. ముఖ్యంగా ప్రస్తుత డెల్టా పరిస్థితి ఏమిటి ? ఎక్కడ కాలువలు కోతకు గురయ్యాయి? ఆక్రమణలు ఏ మేరకు జరిగాయి. కాలువలు, డ్రెయిన్ల పరిస్థితి ఏమిటి ? ఏ మేరకు పూడుకు పోయాయి. ఇలా అన్ని వివరా లతో సర్వే నివేదికను రూపొందించనున్నారు. మ్యాప్‌లు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయ నున్నారు. సర్వేలో గోదావరి డెల్టా పరిఽధిలో కాలు ష్యాన్ని పసిగట్టనున్నారు. కాలుష్యం వల్లే గోదా వరి జలాలు తాగడానికి ఉపయోగించలేని పరి స్థితి ఏర్పడింది. మరోవైపు శివారు ప్రాంతాలకు సాగు నీరందడం లేదు. కొద్దిపాటి వర్షాలు కురు స్తున్నా సరే లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. రైతులు నష్టపోతున్నారు. భవిష్య త్తులో ఇటువంటి సమస్యలు లేకుండా ఆధుని కీకరణ పనులు చేపట్టేందుకు లైడార్ సర్వే దోహ దపడనుంది. డెల్టా పరిధిలోని ప్రధాన కాలువ లతోపాటు, పంట బోదెల వరకు సర్వే ద్వారా నివేదిక రూపొందిస్తారు.