డిజి లక్ష్మి.. కటాక్షమెప్పుడు?
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:23 AM
పురపాలక సంఘాల్లో డ్వాక్రా సంఘాల్లో చదువుకున్న వారి లక్షాధికారులను చేయాలన్న దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టిన డిజిటల్ లక్ష్మి పథకానికి బాలారిష్టాలు వెంటాడు తూనే ఉన్నాయి.
యూనిట్ల గ్రౌండింగ్‌లో లోపాలు
ఏలూరులో ఒక్కరితోనే సరి
డ్వాక్రా సంఘాల్లో అలజడి
పురపాలక సంఘాల్లో డ్వాక్రా సంఘాల్లో చదువుకున్న వారి లక్షాధికారులను చేయాలన్న దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టిన డిజిటల్ లక్ష్మి పథకానికి బాలారిష్టాలు వెంటాడు తూనే ఉన్నాయి. కామన్ డిజిటల్ సేవా కేంద్రాల నిర్వహణతో తమ సొంత కాళ్ల పైనే నిలబడి ఆదాయం సముపార్జనకు ఉద్దేశించినా ఎక్కడా యూనిట్ల గ్రౌండింగ్ జరగలేదు. ఏలూరు నగరంలో పైలెట్ ప్రాజెక్టుగా పద్మ అనే మహిళకు యూనిట్ ఇవ్వడం ఒక్కటే మినహా..ఇక ఇతర పట్టణాల్లో ఒక్క అడుగు ముందుకు పడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో అతివలకు డిజిలక్ష్మి పథకం అక్కరకు రావడం లేదు. డ్వాక్రా మహిళల్లో అర్హులను ఎంపిక చేసి వారితో మినీ మీ–సేవ కేంద్రాల తరహాలో సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. కామన్ డిజిటల్ సేవా కేంద్రాలు నిర్వహించే లక్ష్యంతో సీఎస్‌సీ పేరిట కేంద్రాలను గుర్తిస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి నగర పంచాయతీల్లో వీరిలో చదువుకున్న వారితో డిజిలక్ష్మి యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా.. అభ్యర్థినుల పేరిట ఐడీ నంబర్ల కేటాయింపు వరకు ఆగింది. జిల్లా వ్యాప్తంగా కేంద్రాల ఏర్పాటుకు అర్హు లను గుర్తించినా ఏలూరు నగరంలో ఒక్కటి తప్ప ఇక ఎక్కడా ప్రారంభం కాలేదు.
విద్యావంతులకు చేయూత
స్లమ్ లెవెల్ సమాఖ్యలు (ఎస్‌ఎల్‌ఎఫ్) స్థాయిలో విద్యావంతులైన మహిళలు సీఎస్‌సీ కేంద్రాలు నిర్వ హించడానికి అర్హులు. పొదుపు సంఘాల్లో సభ్యు రాలై ఉండి డిగ్రీ విద్యార్హత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 245 మందిని గుర్తించారు. వారికి శిక్షణ ఇచ్చి బ్యాంకు రుణం రూ.2.50 లక్షల అందించడమే పథకం ప్రధా న లక్ష్యం. రూ.మూడు లక్షల వర కు రుణం ఇచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాంకర్లను ఒప్పించే విష యంలో మెప్మా అధికారులు, జిల్లా యంత్రాంగం చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. డిజిటల్ పరికరాలు ఏర్పాటుకు వారు ఇండెంట్ ప్రకారం కొనుగోలుకు అవకాశం ఉన్నా ఆ దిశగా మహిళలను ముందుకు నడిపించ లేకపోతున్నారు.
అందించే సేవలు
డీజీలక్ష్మి సీఎస్‌సీ కేంద్రాల్లో బ్యాంకింగ్, బీమా, పెట్టుబడులు చెల్లింపులతో పాటు ఆరోగ్య సేవలు, వ్యవసాయం, ప్రయాణం,
పురపాలక సంఘం–ఎస్‌ఎల్‌ఎఫ్ సంఘాలు–డిజి లక్ష్మి గుర్తింపు– ఐడీ నంబర్లు కేటాయింపు
ఏలూరు కార్పొరేషన్ 159 157 111
నూజివీడు 35 34 30
జంగారెడ్డిగూడెం 34 34 28
చింతలపూడి 17 17 14
మొత్తం 245 242 183