ఇయల్ బూమ్ !
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:25 AM
స్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను రాయి తీ ఇవ్వడానికి అసెంబ్లీలో చట్ట సవరణ చేపట్టింది.
వీఎల్‌టీ రాయితీకి పచ్చజెండా
50 శాతం తగ్గింపునకు నిర్ణయం
చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం
జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగానికి మేలు
నిస్తేజంగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఖాళీ స్థలాలపై 50 శాతం పన్ను రాయి తీ ఇవ్వడానికి అసెంబ్లీలో చట్ట సవరణ చేపట్టింది. దీంతో వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర అగచాట్లు పడిన రియల్టర్లు కొంత మేర తేరుకోనున్నారు. వెంచర్లలోని ప్లాట్లదారులకు మేలు జరగనుంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రియల్ ఎస్టేట్ రంగం వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయింది. రకరకాల భారాలు, ల్యాండ్ కన్వర్షన్ ఫీజుల రూపేణ నష్టాల్లో కూరుకుపోయింది. రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా కూట మి ప్రభుత్వం తాజాగా ఖాళీస్థలాల పన్ను (వీఎల్‌టీ)ను 50 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం చట్టసభలో తీసుకుంది. దీంతో రాబోయే కాలంలో రియల్ ఎస్టేట్ రంగానికి మరింత భూమ్ రానుంది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న ఖాళీ స్థలాల పన్ను స్థానిక సంస్థలకు జమ కానుంది. జిల్లా పరిఽధిలో ఎక్కువ ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి (ఇడా)కు మరింత ఆదాయం సమకూరనుంది.
జిల్లాలో నూతనోత్సాహం
ఏలూరు కార్పొరేషన్ చుట్టు పక్కలా, జంగారెడ్డిగూడెం, చింతలపూడి పరిధిల్లో ఇటీవల రియల్ ఎస్టేట్ వెంచర్లు విస్తరిస్తున్నాయి. ఇందులో అధికారికంగా చాలా తక్కువ మొత్తంలో వెలిశాయి. చాలాచోట్ల అనధికారికంగా వెలి సినవే ఎక్కువ. ప్రధానంగా వీఎల్‌టీ భారం నుంచి తప్పించుకునే యజమానులు ఈసారి తగ్గింపుతో వారు దారిలోకి రావాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం హయాంలో ఇటీవలే నాలాను రెవెన్యూ పరిధి నుంచి పూర్తిగా తొలగించారు. వీటి స్థానంలో ల్యాండ్ కన్వర్షన్ ఫీజును 9 శాతం నుంచి 4 శాతానికి తగ్గించారు. ఈ విధానం వల్ల కూడా టౌన్‌అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ)కు రియల్ ఎస్టేట్‌ల ఆదాయం పెద్దగా రావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీఎల్‌టీను 50 శాతానికి తగ్గించడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం జోష్ అందుకోనుంది. ఎకరం రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే రూ.లక్ష వరకు నాలా కింద చెల్లిస్తున్నారు. చట్ట సవరణకు సంబంధించిన అంశాలపై విధి విధానాలు రావాల్సి ఉంది.
మార్చి నుంచే అమలు చేస్తారా?
చట్ట సభల్లో రియల్ భూములపై వీఎల్‌టీ 50 శాతం తగ్గింపు సవరణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దాని తర్వాత ఈ విధానం అమ లులోకి రానుంది. ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపా రంలోకి దిగిన వారికి ప్రభుత్వం నిర్ణయం చాలావరకు ఊరటనిస్తుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి.. నిర్మాణం పూర్తి అయ్యేలోగా 50 శాతం రాయితీ వర్తిస్తుంది. దీనిపై స్థానిక సంస్థలు, ఇడా, టౌన్‌అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీవో)లు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. మార్చి మొదటి వారం నుంచి ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.