మీకు బాధ్యత లేదా..?
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:26 AM
ఆస్తి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి. మండలంలో ఆస్తి పన్నుల వసూళ్లు అతి తక్కువగా ఉన్నాయి. నిర్దే శించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సిన బాధ్యత మీకు లేదా..?
ముసునూరు, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి):‘ఆస్తి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి. మండలంలో ఆస్తి పన్నుల వసూళ్లు అతి తక్కువగా ఉన్నాయి. నిర్దే శించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సిన బాధ్యత మీకు లేదా..? ఆస్తి పన్ను బకాయిలు, ప్రస్తుత సంవత్సరం పన్ను లను ఈ నెలాఖరులోగా పూర్తిగా వసూలు చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అంటూ అధికా రులపై కలెక్టర్ వెట్రిసెల్వి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసునూరు మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె బుధవారం ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరి శీలించారు. సబ్ కలెక్టర్ వినూత్న, జడ్పీ సీఈవో శ్రీహరి, డీపీవో అనురాధ, డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఎంపీడీవో ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్టాండ్ ఆకస్మిక తనిఖీ
నూజివీడు: నూజివీడు బస్టాండ్‌ను కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం తనిఖీ చేశారు. ప్రయాణికులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఉచిత బస్సు సౌకర్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసు కున్నారు. సబ్ కలెక్టర్ వినూత్న, డీటీపీవో షేక్ షబ్నం, తహసీల్దార్ భద్రు, ఆర్టీసీ డీఎం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మెనూలో నాణ్యత లోపిస్తే చర్యలు
నూజివీడు టౌన్ : ప్రభుత్వ పాఠశాలలలో విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు బోధన చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలను, అన్నవరం రోడ్డులోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులంను బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో తరగతి సిలబస్‌కి సంబంధించిన ప్రశ్నలను విద్యా ర్థినులను అడిగారు. గురుకులంలో భోజనాన్ని పరి శీలించారు. నాణ్యతలేని భోజనాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు.