వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.
‘వర్కులు కావాల్సిన మున్సిపల్ కౌన్సిలర్లంతా మా ఇంటికి వచ్చి వారి వార్డులో పనులు పెట్టించుకుం టున్నారు.. మీరు మాత్రం రారు. చిన్నా గారిని అడగరు.. చిన్నా గారిని అడగకపోతే మీకు పను లెలా పెడతాము అనుకుంటున్నారు’.. అని మునిసి పల్ చైర్‌పర్సన్ బత్తిన నాగలక్ష్మి నాల్గొవ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ (జనసేన)ను ఉద్దేశించి శనివారం జరిగిన జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమా వేశంలో వ్యాఖ్యానించడంతో తీవ్ర దుమారం చెల రేగింది.
సీఎం చంద్రబాబు డిసెంబరు 1న ఉంగుటూరు నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.
గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ అయ్యింది.
ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని ఉన్నత విద్యవైపు నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు పైసా విదల్చకపోవడంతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొర పెట్టుకున్నా పట్టించుకున్న నాఽథుడే కరువయ్యాడు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు పేరుతో ప్రభుత్వ హైస్కూల్లో వసూళ్ల దందా ప్రారంభమైంది. కార్పొరేట్ పాఠ శాలల తరహాలో ఏకంగా లిస్టులు తయారు చేసి విద్యార్థులకు ఇచ్చి సొమ్ము కట్టాలంటూ మండలం లోని రెండు హైస్కూళ్ల హెచ్‌ఎంలు ఆదేశిం చడం గమనార్హం.
సెల్‌ఫోన్ చూస్తున్నారా, సెల్‌ఫోన్‌లో ఏం చూస్తున్నారు అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రశ్నించారు. శుక్ర వారం తణుకు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులతో మమేకమ య్యారు.
పెట్రోలు బంకుల నిర్వహణ వల్ల జైళ్లశాఖ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, తద్వారా ఆదాయ వనరులను సమకూరుస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అంజనీకుమార్ యాదవ్ అన్నారు.