Share News

వీటికి అడ్డేలేదు..!

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:45 AM

పురపాలక సంఘ పరిధిలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్ర ణ(కు.ని) శస్త్ర చికిత్సలు ప్రహసనంగా మారాయి.

వీటికి అడ్డేలేదు..!

అక్కరకు రాని కు.ని. చికిత్సలు

పుట్టుకొస్తున్న కుక్క పిల్లలు

పట్టణ వాసుల్లో పలు అనుమానాలు

పాలకొల్లు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):పురపాలక సంఘ పరిధిలో వీధి కుక్కలకు కుటుంబ నియంత్ర ణ(కు.ని) శస్త్ర చికిత్సలు ప్రహసనంగా మారాయి. వీధి కుక్కలను పూర్తిగా నిర్మూలిం చడానికి పట్టణం లోని పశు వైద్యశాల ప్రాంగణంలో పురపాలక సంఘ నిధులు సుమారు రూ. 20లక్షలు వెచ్చించి షెడ్లను నిర్మించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించే కుక్కలను గుర్తించి పశు వైద్యశాలకు తరలించి వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు జరిపి ఐదు రోజులు పశు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయ ని ధ్రువీకరించిన అనంతరం కుక్కలను ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదలాలి. ఇందుకు గాను ఒక్కొక్క కుక్కకి పురపాలక సంఘం రూ.1500 ఖర్చు చేస్తుంది. పట్టణంలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయోనని సర్వే జరిపినప్పుడు తొలుత 500, తర్వాత 1000 పైబడి ఇప్పుడు 1600 కుక్కలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక దశలో నూరు శాతం కుక్కలకి కుని చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే విచిత్రంగా కుక్కల మరలా పిల్లలకు జన్మనిస్తున్నాయి. ఇదేలా సాధ్యమని పట్టణ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఊర్లో కుక్కలు ఊర్లో .... అనే సామెత ఉంది అది నిజం చేస్తూ కొన్ని ఆడ కుక్కలు సమీప గ్రామాలకు వెళ్లి గర్భం దాల్చే అవకాశం లేకపోలేదని సమర్ధించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ 10రోజుల వ్యవధిలో పట్టణా ల్లోని వివిధ ప్రాంతాల్లో అర డజనుకు పైబడి కుక్కలు పిల్లలకు జన్మనిచ్చాయి. దీంతో పట్టణంలో కుక్కల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉ న్నది. ఇది ఇలా ఉండగా పట్టణంలో మొత్తం 1600కుక్కలు గుర్తించా మని ఇప్పటికీ 1482 కుక్కలకి కుని ఆప రేషన్లు చేశామని కమిషనర్‌ తెలిపారు. అయితే తాజాగా పుడుతున్న కుక్క పిల్లలు ఒకటి రెండు నెలల్లో ఎదిగి పెద్దవైతే వీటి సరసన చేరుతుంటాయి. పురపాలక సంఘానికి చేర్చి పూలపల్లి, ఉల్లంపర్రు, అడవిపాలెం, పాలకొల్లు రూరల్‌ పంచాయతీ పలు గ్రామాలు ఉన్నాయి. ఈప్రాంతా ల్లో వీధి కుక్కలను గుర్తించి మొత్తం అన్ని వీధి కుక్కలకు ఒకేసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తేనే ఫలితం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కుక్కలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లి అక్కడి కుక్కలతో లైంగిక చర్యల్లో పాల్గొని మరలా వాటి పూర్వ ప్రాంతాలకు వచ్చి పిల్లలను కనే అవకాశాలు ఉన్నందున కుక్కలకు పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో ఒకే సారి కు.ని. చేయాలని పశు వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:45 AM