Share News

పులి కదలికలు గుర్తింపు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:39 AM

పాపికొండల నేషనల్‌ పార్కులో అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతి , రాజమహేంద్రవరం అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ నీలకంఠనాఽథ్‌రెడ్డి, ప్రత్యేక వన్యప్రాణి విభాగ అధికారి బీఎన్‌ మూర్తి శుక్రవారం పర్యటించారు

పులి కదలికలు గుర్తింపు
పాపికొండల నేషనల్‌ పార్కులో అటవీశాఖ అధికారులు

పోలవరం, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి) : పాపికొండల నేషనల్‌ పార్కులో అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ చలపతి , రాజమహేంద్రవరం అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ నీలకంఠనాఽథ్‌రెడ్డి, ప్రత్యేక వన్యప్రాణి విభాగ అధికారి బీఎన్‌ మూర్తి శుక్రవారం పర్యటించారు. ఇటీవల పాపికొండల నేషనల్‌ పార్కులో కొండమొదలు ప్రాంతంలో పులిని విడిచిపెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. పులి మెడకు అమర్చిన రేడియో జీపీఎస్‌ ట్రాకింగ్‌ కాలర్‌ ద్వారా పులి కదలికలను గుర్తించారు. పులి వదిలిన ప్రాంతానికి సమీప అడవుల్లో సంచరిస్తున్నట్టు గురించామని అధికారులు తెలిపారు. తమ వెంట కొన్ని జింకలను తీసుకెళ్లి కచ్చులూరు ప్రాంతంలో వదిలినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల డిప్యూటి ఫారెస్టు అధికారులు, ఎన్‌.దావీదు రాజు, పోలవరం అటవీక్షేత్రాధికారి ఎస్‌కే వలీ అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:39 AM