మధ్యాహ్న భోజనం బాగుంది..!
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:19 AM
మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా 916 పాఠశాలల్లో కలెక్టర్, జేసీ మొదలుకొని మండలస్థా యి వరకు 916 మంది అధికారులు బుధవారం తనిఖీలు చేశారు.
పథకం అమలుపై ఒకేరోజు 916
పాఠశాలల్లో 916 మంది అధికారుల తనిఖీ
భీమవరం రూరల్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించేందుకు జిల్లావ్యాప్తంగా 916 పాఠశాలల్లో కలెక్టర్, జేసీ మొదలుకొని మండలస్థా యి వరకు 916 మంది అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఒకేసారి ఇన్ని పాఠశాలల్లో తనిఖీ చేపట్టినట్టు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ‘ఈ పాఠశా లల్లో 61,573 మంది విద్యార్థులకు 52,171 హాజరుకాగా, 50,033 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారు. తనిఖీల్లో మెనూ, పదార్థాల నాణ్యత, రుచి, వంట గది పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆహారాన్ని రుచి చూశారు. పలుచోట్ల చిన్న చిన్న లోపాలు వున్నప్పటికి ఈ పథకం అమలు తీరు సంతృప్తికరంగానే వున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారని అధికారులు నివేదికల్లో పేర్కొన్నట్టు కలెక్టర్ తెలిపారు. రుచి, పరిమాణం లోపిస్తే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తప్పవని హెచ్చరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.