నమ్మించి మోసం చేశారని, న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోవడం లేదంటూ ఇద్దరు బాధితులు పురుగుమందు తాగిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనంగా మారింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీటీ గ్రావెల్ రోడ్లపై తారు వేయకుండా వదిలేయడంతో పగుళ్లతో గోతులు పడి కుంగిపోతున్నాయి. బీటీ రోడ్ల నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో తారు వేయకుండా కాంట్రాక్టర్ నిలుపుదల చేశారు.
పలు డిమాండ్ల సాధన కోసం ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ (డీఎంహెచ్‌వో పరిధి)లో కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం నుంచి ప్రారంభించిన సమ్మె తొలిరోజున జిల్లాలో పాక్షికంగా జరిగింది.
విద్యార్థుల సురక్షిత ప్రయా ణాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సుల నిర్వహణలో నిబంధనలను పాటించాలని ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ అన్నారు.
కొల్లేరు పక్షుల అభయారణ్యంపై సుప్రీం నియమిత సాధికారి కమిటీ కోరిన అంశాలపై తుది సమాచారాన్ని జిల్లా యంత్రాంగం రూపొం దించిందని, ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సమర్పిస్తుందని కలెక్టర్ కె.వెట్రి సెల్వి తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఏలూరు సర్కిల్ కార్యాలయంలో బదిలీల వ్యవహారం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఏళ్ల తరబడి తమ స్థానాల్లో పాతుకుపోయి హల్‌చల్ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా విధులకు రావడం, తోటి ఉద్యోగులపై పెత్తనాలు, కుమ్మక్కు వ్యవహా రాలతో శాఖను అప్రదిష్ట పాలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ఎల్‌నినో ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపించింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు కురిసిన వర్షపాతాలను పరిశీలిస్తే జిల్లాలో 46 శాతంకు పైగా లోటు వర్షపాతం కనిపించడంతో ఎనిమిది మండలా లను కరవు మండలాలుగా ప్రకటించారు. మరోవైపు సార్వాసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడంతో పంట దిగుబడులు తగ్గనున్నాయి.
రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
జిల్లాలో సార్వా సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత కీలకమైన ఈ క్రాప్ నమోదు పూర్తయింది.
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్‌కుమార్‌గుప్త ఈనెల 7వ తేదీన ఏలూరు నగరానికి రానున్నారు.