Share News

వేగిరాజు శివవర్మ సేవలు అభినందనీయం

ABN , Publish Date - Feb 22 , 2026 | 12:25 AM

జయలక్ష్మి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వేగిరాజు శివవర్మ ప్రాతాళ్లమెరక గ్రామంలో చేస్తున్న అభివృద్ధి అభినందనీయమని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు.

వేగిరాజు శివవర్మ సేవలు అభినందనీయం
ప్రాతాళ్లమెరకలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ రఘురామ, కలెక్టర్‌ నాగరాణి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఏపీఐఐసీ చైర్మన్‌ రామరాజు తదితరులు

ప్రాతాళ్లమెరకలో రూ.3 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభం

కాళ్ళ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): విజయలక్ష్మి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వేగిరాజు శివవర్మ ప్రాతాళ్లమెరక గ్రామంలో చేస్తున్న అభివృద్ధి అభినందనీయమని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. గ్రామంలో మెమోరియల్‌ ట్రస్ట్‌ 30వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం పలు అభివృద్ధి పనులను కలెక్టర్‌ నాగరాణి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ, ఏపీ ఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే మంతెన అనంతవర్మలతో కలిసి ఆయన ప్రారంభించారు. సుమారు కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మాణం చేసిన మంచినీటి చెరువు, మైక్రోఫిల్టర్‌, మంచినీటి పైపులైను, సీసీ కెమెరా సిస్టం ఏర్పాటును రూ.1.25 కోట్ల వ్యయంతో గ్రామ మురుగునీటిపారుదల కోసం చేసిన డ్రెయినేజీ సిస్టమ్‌ను, రూ.50 లక్షల వ్యయంతో చినపేట మంచినీటి చెరువు సంరక్షణ కోసం కట్టిన వాల్‌, వాకింగ్‌ ట్రాక్‌, సీసీ రోడ్లను రూ.25 లక్షల వ్యయంతో దివంగత వత్సవాయి రాధామణి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను, దివంగత వత్సవాయి సూర్యనారాయణరాజు ప్రజా వైద్యశాల పునఃప్రారంభం, అంబులెన్స్‌ తదితర సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌ కంతేటి ఉషశ్రీనివాసరాజు, ట్రస్ట్‌ మేనేజింగ్‌ దంపతులు వేగిరాజు శివవర్మ, సుజాత, కంతేటి వెంకట్రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 12:25 AM