నేరస్తులు శిక్ష తప్పించుకోకూడదు
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:23 AM
నేరస్తులు శిక్ష తప్పించు కోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ముద్దాయిలకు శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు ఆదేశించారు.
ఏలూరు జిల్లా ఏఎస్పీ సూర్యచంద్రరావు
ఏలూరుక్రైం, ఫిబ్రవరి21(ఆంధ్రజ్యోతి): నేరస్తులు శిక్ష తప్పించు కోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ముద్దాయిలకు శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్.సూర్యచంద్రరావు ఆదేశించారు. ఏలూరు జిల్లా ఎస్పీ శివకిశోర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులతో శనివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేసుల విచారణ వేగవంతం చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 47 కేసులలో న్యాయస్థానాలు శిక్షలు విధిం చాయన్నారు. వాటిలో నాలుగు కేసులలో రెండు జీవిత ఖైదు శిక్షలు, మూడు కేసులలో 20ఏళ్ల శిక్షలు, పది కేసుల్లో పదేళ్లపాటు శిక్షలు, మూడు కేసుల్లో ఏడేళ్లపాటు జైలు శిక్ష, ఐదు కేసుల్లో ఐదేళ్ల జైలు శిక్ష, నాలుగు కేసుల్లో ఏడాదిపాటు జైలు శిక్ష విధించారని వివరించారు. సాక్ష్యులను సకాలంలో కోర్టుకు హాజరు పరిచి కేసు విచారణ వేగంగా జరిగేలా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. విచారణలో జాప్యం జరుగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులపై ఉందన్నారు. ప్రతి రోజు కోర్టులో జరిగే సమాచారాన్ని సంబంధిత స్టేషన్ అధికారులకు తెలియ జేయాలన్నారు. కార్యక్రమంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్‌స్పెక్టర్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, కోర్టు మానిటరిం గ్‌సెల్ సభ్యులు పాల్గొన్నారు.