గట్లు కొట్టి.. కోట్లు పట్టి
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:50 AM
జీలుగుమిల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతోం ది. ఆంరఽధా తెలంగాణ సరి హద్దు ప్రాంత పామాయిల్ తోటల్లో రాత్రి వేళ టిప్పర్లతో తీసుకొచ్చి టన్నుల కొద్దీ అక్రమంగా నిల్వ చేశారు.
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దు తోటల్లో గుట్టలు
ఇక్కడి నుంచి భారీగా అమ్మకాలు
పట్టించుకోని వివిధ శాఖల అధికారులు
జీలుగుమిల్లి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి):జీలుగుమిల్లిలో మట్టి మాఫియా రెచ్చిపోతోం ది. ఆంరఽధా తెలంగాణ సరి హద్దు ప్రాంత పామాయిల్ తోటల్లో రాత్రి వేళ టిప్పర్లతో తీసుకొచ్చి టన్నుల కొద్దీ అక్రమంగా నిల్వ చేశారు. ప్రస్తుతం చింతలపూడి కాల్వ గట్లను కొల్లగొట్టి కోట్లు పోగేస్తున్నారు. నాయకుల చేతుల్లో ఈ కాల్వ గట్టు బక్కచిక్కింది. జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, కొయ్యలగూడెం ప్రాంతాలకు నెల రోజులుగా కిలోమీటర్ల మేర కాల్వ గట్ల మట్టి కొల్లగొట్టి తరలించేశారు. అధికారులు ఎవరూ కన్నెత్తి చూడకపోవడంతో మరి కొంత మట్టి గుట్టలు నిల్వ చేశారు. ఇలా వదిలేస్తే కొన్ని రోజులకు చింతలపూడి కాల్వ గట్లు కనుమరుగయ్యే పరిస్థితి వుంది. స్థానిక అవసరాలకు కాస్తో కుస్తో మట్టి తెస్తే కుదరదని స్థానికులపై పోలీసు రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి టన్నుల కొద్దీ మట్టి తరలించే వారి వైపు చూసీ చూడ నట్లు అధికారులు వ్యవహరిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు.
ఇటీవల అధికారులకు బెదిరింపులు
దర్భగూడెం, పి.రాజవరం, ములగలంపల్లి ప్రాంతాల్లో అక్రమంగా ప్రతీ రోజు ఏదో ప్రాంతంలో వందల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ మట్టి ని దోచేస్తున్నారు. తీరా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను రెవెన్యూ అధికారులే తిరిగి మట్టి మాఫియాకు చేరవేస్తుం డడంతో ప్రజలు కిమ్మనడం లేదు. మరోవైపు సంబంధిత అధికారులను ఓ నాయకుడు బెదిరించి ప్రజా ప్రతినిధుల పేరు చెప్పడం కొసమెరు పు. ప్రభుత్వ భవనాల నిర్మాణం పేరిట, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిన అనంతరం అంచులకు ఈ గ్రావెల్ మట్టినే ఆ నాయకుడు అమ్ముకోవ డం చర్చనీయాంశమైంది. అటవీ శాఖ పరిధిలోని కాల్వ గట్టును ఆయా అధికారులు పట్టించుకోకపోవడంతో వారికి వరంగా మారింది.