డ్రోన్ వచ్చింది.. వైరు అందించింది
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:30 AM
ఒక స్తంభం నుంచి మరో సంభానికి భారీ విద్యుత్ వైర్లను పైకి తీసు కెళ్లి కలుపుతూ ముందుకు వెళ్లడం చాలా కష్టతరమైన పని.
ఈజీ అయిన భారీ విద్యుత్ లైన్ పనులు
పది మంది పని నలుగురితో పూర్తి
ప్రయోగాత్మకంగా నరసాపురంలో..
నరసాపురం, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఒక స్తంభం నుంచి మరో సంభానికి భారీ విద్యుత్ వైర్లను పైకి తీసు కెళ్లి కలుపుతూ ముందుకు వెళ్లడం చాలా కష్టతరమైన పని. ఈ పనిని ప్రత్యేకంగా శిక్షణ పొందిన కార్మికులు మాత్రమే చేయాలి. ఒకరు వైర్లను లాగుతూ వెళితే మరి కొందరు ఆ వైరును నడుముకు కట్టుకుని స్తంభం ఎక్కే వారు. ఇలా ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి బిగిస్తూ కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసేవారు. దీనివల్ల ఎక్కువ మంది కార్మికులతోపాటు సమయం పట్టేది. ఈపీడీసీఎల్ ప్రయోగాత్మకంగా డ్రోన్ సాయంతో లైన్ల ఏర్పాటు పనులు చేపట్టింది. ప్రయోగాత్మకంగా నరసాపురాన్ని ఎంపిక చేసింది. నరసాపురం సబ్‌స్టేషన్ నుంచి యలమంచిలి సబ్ స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల మేర కొత్తగా 11 కేవీ విద్యుత్ వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనిని డ్రోన్ సాయంతో ప్రారంభించారు. ముందుగా డ్రోన్‌కు 11 కేవీ వైర్‌ను, కండక్టర్‌ను కట్టారు. అది గాలిలోకి వెళ్లి పోల్ మీద ఉన్న వ్యక్తికి అందిస్తుంది. దాన్ని పోల్ మీద ఉన్న కార్మి కుడు అందుకోగానే మళ్లీ డ్రోన్‌ను కిందకు తీసు కొస్తు న్నారు. ఇలా డ్రోన్ ద్వారా వైర్లను ఒక స్తంభం నుంచి మరో స్తంభానికి అందిస్తున్నారు. తక్కువ మంది కార్మికు లతో పనిని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ పనులను శనివారం ఈపీడీసీఎల్ నరసాపురం ఈఈ మధుకుమార్, పాలకొల్లు డీఈ రామకృష్ణ, ఏఈ చండీ కిరణ్‌బాబు పర్యవేక్షించారు. గతంలో ఒక కిలోమీటర్ కొత్త వైర్ లాగాలంటే నాలుగు రోజులు పట్టేది. పది మంది కార్మికులు ఉండాల్సి వచ్చేది. నేడు డ్రోన్‌తో చేపట్టడం వల్ల నలుగురు కార్మికులు సరిపోతున్నారు. రోజుకు కిలోమీటర్ మేర పనులు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఉపయో గిస్తున్న డ్రోన్ వ్యవసాయ శాఖ నుంచి తీసుకొచ్చి పనులు చేపడుతున్నాం.