ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:40 AM
జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యో గుల సమస్యలు తీర్చేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు అందాయి.
ఏలూరు రూరల్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యో గుల సమస్యలు తీర్చేందుకు శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 46 అర్జీలు అందాయి. డీఆర్వో విశ్వేశ్వరరావు, తదితర శాఖల అధికారులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. డీఆర్వో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు సమస్య లను పరిష్కరించేందుకు నెలలో ప్రతి మూడో శుక్ర వారం జిల్లా స్థాయి ‘ఎంప్లాయీస్ గ్రీవెన్స్‌డే’ నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, సేవా భద్ర త, పదోన్నతులు, బదిలీలు ఇతర పరిపాలనా అంశా లపై వచ్చిన వినతులను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచిం చారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, గృహ నిర్మాణ శాఖ డీడీ సత్యనారాయణ, డీపీవో అనురాథ, ఏపీ ఎన్జీవో జిల్లా ప్రెసిడెంటు చోడగిరి శ్రీనివాస రావు, జడ్పీ ఏవో జాన్సన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.