Share News

21 రోజులు

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:42 AM

రాష్ట్రంలో జననాలు, మరణాల నమోదులో ప్రభుత్వం కొత్త నిబం ధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై జనన, మరణాలు సంభవిస్తే తప్పనిసరిగా 21 రోజుల్లో నమోదు చేయించు కోవాలి.

 21 రోజులు

లేకపోతే అపరాధ రుసుం చెల్లించాల్సిందే..

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు

పారదర్శకంగా అధికారులు కదులుతారా..!

రాష్ట్రంలో జననాలు, మరణాల నమోదులో ప్రభుత్వం కొత్త నిబం ధనలు అమల్లోకి తెచ్చింది. ఇకపై జనన, మరణాలు సంభవిస్తే తప్పనిసరిగా 21 రోజుల్లో నమోదు చేయించు కోవాలి. లేదంటే ఆపై అపరాధ రుసుం చెల్లించి పొందాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఈనెల 17 నుంచి వర్తిస్తాయని రాష్ట్ర మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌శాఖ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జనన, మరణ పత్రాలను విధిగా ఆయా కుటుంబ సభ్యులకు సంబంధించిన వారు సకాలంలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల అప రాధ రుసుంల చెల్లింపులతో పాటు..వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధా నంగా పాఠశాలల్లో చేరికలు, పాస్‌పోర్టు, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లెసెన్సు తదితరాలు పొందేందుకు జనన ధ్రువీ కరణ పత్రం తప్పనిసరి. ఆస్తి వ్యవహారాలు, బ్యాంకు ఖాతాల్లోని నిధుల బదలాయింపు, ఇతర పనులకు మరణ ధ్రువీకరణ (డెత్‌ సర్టిఫికెట్‌) పత్రాలు కీలకంగా మారుతున్నాయి. చాలామంది వీటి నమోదులో నిర్లక్ష్యం వహించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆలస్యమైతే అపరాధ రుసుం

జననం లేదా మరణించిన తేదీ తర్వాత 21 నుంచి 30 రోజుల్లోపు నమోదు చేయిస్తే రూ.25 అపరాధ రుసం చెల్లించాలి. 30 రోజుల తర్వాత నుంచి ఏడాదిలోపు నమోదు చేయాలంటే జిల్లా రిజిస్ర్టార్‌కు (జనన, మరణాల) రాత పూర్వక వినతితో పాటు రూ.250 అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది దాటితే కలెక్టర్‌ (జిల్లా మెజిస్ర్టేట్‌) లేదా ఆర్డీవో (సబ్‌ డివిజనల్‌ మెజిస్ర్టేట్‌) అనుమతితో పాటు అపరాధ రుసుం కింద రూ.500 చెల్లించాలి. దీంతో పాటు ఫారం–14 ద్వారా అఫిడవిట్‌ సమర్పించాలి. బిడ్డ పుట్టిన వెంటనే కొందరు జనన ధ్రువీకరణ పత్రంలో పేర్లు నమోదు చేయడం లేదు. అలాంటి వారు 12 నెలల లోపు ఉచితంగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. 12 నెలల నుంచి 15 ఏళ్లలోపు పేరు చేర్చాలనుకుంటే రూ.250 అపరాధ రుసుం చెల్లించాలి.

బాధ్యత వారిదే..

జననం లేదా మరణం ఆసుపత్రిలో జరిగితే.. ఆ సంస్థ తాలూకా బాధ్యులే నిర్ణీత ఫార్మాట్‌లో సమాచారాన్ని రిజిస్ర్టార్‌కు పంపిస్తారు. ఇంట్లో జరిగితే ఇంటి యజమాని లేదా పెద్ద ఆ సమాచారాన్ని అందించే బాధ్యత తీసు కోవాలి. ఆసుపత్రిలో పుట్టిన, చనిపోయినా సిబ్బందే ధ్రువపత్రాలు ఇస్తారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందాలనే ఆతృతతో సరైన సమాచారం ఆయా స్థానిక సంస్థలకు ఇవ్వకపోవడంతో వీటిని పొందడంలో జాప్యం జరుగు తోంది. పారదర్శకంగా సమాచారం, డాక్యుమెంట్లు కుటుంబ సభ్యులు సకాలంలో ఇస్తే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందడం సాధ్యం. ఇదిలా ఉండగా మునిసిపాలిటీల్లో, పంచాయతీల్లో ప్రత్యేకంగా ఇవి పరిశీలించే సిబ్బంది, అఽధికారులు నిర్లక్ష్యం వల్ల కూడా పేదలు, ఇతరవర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:42 AM