ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైం దని, దీనికి సెప్టెంబరు 5వ తేదీ డెడ్‌లైన్ అని ఏపీ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది.
పామా యిల్ ధరలో రెండు నెలలపాటు తగ్గుదల కని పించగా ఈసారి కాస్త పెరుగుదల కనిపించడం తో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలోని వర్గ విబేధాలు మరోసారి బయటపడ్డాయి.
వేగవరం హైస్కూల్ సమీపంలోని ఓ పామాయిల్ తోటలో ట్రామడెక్స్, ట్రామెక్ అనే రెండు కంపెనీలకు చెందిన నార్కోటిక్ (ఎన్‌ఆర్‌ఎక్స్) డ్రగ్ ఇంజక్షన్లతో పాటు సూదులు పడవేసిన ఘటన కలకలం రేపుతోంది.
వాయుగుండం ప్రభావంతో పాలకొల్లు, ఆచంట మండలాల్లో బుధవారం భారీవర్షం కురిసింది.
భీమవరం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (భీమా–ఉడా) ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దెందులూరులో ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
గొల్లగుప్ప గ్రామంలో వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని అధికారులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆసుపత్రిలో బాధితులకు మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో క్లోరోక్విన్ వికటించి బాలిక మృతి చెందడంతోపాటు పలువురు అనారోగ్యం పాలైన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాపై సీఎం చంద్రబాబు మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారు. నరసాపురం నియోజకవర్గానికి తాను అనేక పర్యాయాలు వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా మంగళవారం నరసాపురం నియోజక వర్గంలో సీఎం పర్యటన విజయవంతమైంది. మొగల్తూరు లో ప్రజావేదిక సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా మహిళలు, యువత, పార్టీ శ్రేణులు, నాయకులు తరలివచ్చారు.