జిల్లా పురోభివృద్ధికి.. పునరంకితం
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:09 AM
దేశ స్వాతం త్య్ర సముపార్జనలో ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందేలా ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.
సోలార్ ప్యానెల్స్‌లో జిల్లాకు ప్రఽథమస్థానం
పరిశ్రమల స్థాపనకురూ.679.39 కోట్లతో ఎంవోయూ
స్వర్ణాంధ్ర 2047 సాధనకు సంయుక్త కృషి
కలెక్టర్ వెట్రిసెల్వి.. జెండావిష్కరణ
అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు
ఏలూరు,జనవరి 26 (ఆంధ్రజ్యోతి): దేశ స్వాతం త్య్ర సముపార్జనలో ఎన్నో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లాను అన్ని రంగాల్లో పురోభివృద్ధి చెందేలా ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో 77వ జాతీయ గణంత్ర వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. జాతి ఔన్నత్యాన్ని చాటుతూ వివిధ పాఠశాలలు ప్రద ర్శించిన నృత్యాలు ఆలోచింపచేశాయి. ప్రభుత్వశాఖల అభివృద్ధి ఆయా శాఖల శకటాల ద్వారా ప్రస్ఫుటమైం ది. ఎస్పీ ప్రతాప కిశోర్‌తో కలిసి కలెక్టర్ జాతీయ పతకావిష్కరణ చేసిన కలెక్టర్, పోలీసుల పరేడ్ వీక్షణ చేసిన అనంతరం సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజల నుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ..
‘సంక్షేమంతో పాటు, అభివృద్ధికి సమాన ప్రాధా న్యత ఇస్తున్నాం. ప్రభుత్వ సుపరిపాలన సాధనలో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యాచరణకు ప్రణాళికాబద్ధంగా కార్య్రమాలు అమలు చేయాలి. పీ–4 కార్యక్రమంతో జిల్లాలోని 71,876 బంగారు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేం దుకు 5,519 మార్గదర్శకులను గుర్తించాం. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 1.60 లక్షల మంది రైతులకు రూ.213.31 కోట్ల వ్యయంతో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయం అందించాం. వ్యవసాయ యాంత్రీకరణలో 52 కిసాన్ డ్రోన్లు, 4.8 లక్షల విలువైన యంత్ర పరికరాలను 915 మంది రైతులకు రూ.2.89 కోట్ల రాయితీ అందజేశాం. ప్రధాన మంత్రి సూర్యఘర్‌లో జిల్లాలో 6,503 మంది విని యోగదారు లకు 19 మెగావాట్స్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడంతో రాష్ట్రంలో ఏలూరు మొదటి స్థానంలో నిలిచింది. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో జిల్లాలో రూ.679.39 లక్షల వ్యయంతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. జిల్లాలో మావోయిస్టుల కదిలికలపై గట్టి నిఘాతో 15 మందిని అరెస్టు చేశాం. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేరస్తు లన్న పోలీస్ యంత్రాంగం పట్టుకుని.. దేశంలోనే జిల్లా పోలీసులు గుర్తింపు సాధించారు’ అంటూ పేర్కొన్నారు. ఎస్పీ ప్రతాప్ కిశోర్, జేసీ అభిషేక్ గౌడ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏఎస్పీ సూర్యచంద్రరావు, డీఆర్వో విశ్వేశ్వర రావు, జడ్పీ సీఈవో సుబ్బారావు, ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఈవో వెంకట లక్ష్మమ్మ, వాణిజ్య పన్నుల శాఖ జేసీ నాగార్జునరావు, తహసీల్దార్ గాయత్రి, సెట్వెల్ సీఈవో ప్రభాకర్‌రావు, డీఎస్‌డీవో ఎస్‌ఏ అజీజ్ పాల్గొన్నారు.