Share News

వెళ్లి రావమ్మా!

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:04 AM

కనివినీ ఎరుగని రీతిలో.. చరిత్ర చూడని జాతరను ఏలూరు ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రజలు పోటెత్తి చరిత్రను తిరగ రాశారు. అనుకోని రీతిలో వేలల్లో జనాభా ఏలూరుకు దూర ప్రాంతాల నుంచి తరలిరావడంతో శనివారం నుంచి సోమవారం వరకు నగరం జనసంద్రమైంది.

వెళ్లి రావమ్మా!
తూర్పువీధి జాతరలో పాల్గొన్న జనం

కొర్లబండిలో పొలిమేరలకు అమ్మవార్లు

వైభవంగా ఐదుచోట్ల ముగిసిన జాతరలు

పోటెత్తిన జనం.. కిక్కిరిసిన ఏలూరు

ఇక మిగిలింది పడమరవీధి,తంగెళ్లమూడి జాతరలు

ఏలూరు కార్పొరేషన్‌. జనవరి 26: కనివినీ ఎరుగని రీతిలో.. చరిత్ర చూడని జాతరను ఏలూరు ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రజలు పోటెత్తి చరిత్రను తిరగ రాశారు. అనుకోని రీతిలో వేలల్లో జనాభా ఏలూరుకు దూర ప్రాంతాల నుంచి తరలిరావడంతో శనివారం నుంచి సోమవారం వరకు నగరం జనసంద్రమైంది. సుమారు నాలుగు లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా. తొలి విడత గంగానమ్మ సంబరం ఆదివా రపుపేట, లక్ష్మివారపుపేట, పవర్‌పేట, తూర్పువీధి, దక్షిణపు వీఽధుల్లో ఐదుచోట్ల కలిపి సోమవారం రాత్రి అమ్మవార్లు ఊరి పొలిమేరలు దాటడంతో ముగిసింది. గడియార స్థంభం నుంచి పెద్ద వంతెన (పాత బస్టాండ్‌) వద్దకు భారీగా లక్షల్లో జనం కిక్కిరి సిపోయారు. జాతర ప్రాంతాల నుంచి కొర్ల బండిలో అమ్మవార్లను ఏర్పాటుచేసి నగరంలో భారీ ఊ రేగిం పులు జరిపి నగర పొలిమేరలకు సాగనంపడంతో జాతరలు ముగిసినట్టు జాతర నిర్వాహకులు వంకి నేని భాను ప్రకాశ్‌, అద్దేపల్లి శ్రీనివాసరావు, మామిళ్ళ పల్లి పార్థసారథి, ఇసుకపల్లితాతారావు తెలిపారు. జాతరల ముగింపు వేడుకలకు అంచనాలకు మించి భక్తులు తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసువర్గాలకు కష్టసాధ్యమైంది. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులతో పాటు ప్రజా ప్రతితినిధులు అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా పడమర వీధిలో జరిగే జాతర ఫిబ్రవరి 1న మహాకుంభ నివేదనలు, 2న కొర్లబండి ఊరేగింపులు, తంగెళ్ళమూడిలో ఫిబ్రవరి 8న మహాకుంభ నివేదన, 9న కొర్లబండితో అమ్మవార్లను సాగనంపడంతో నగరంలో జరుగుతున్న ఏడు జాతరలు ముగుస్తాయి.

10వేల మందికి అన్నదానం

ఆర్యవైశ్య ఆలపాటి,అనసూర్యమ్మరామచంద్రరావుగార్ల కార్తీక వనసమారాధన తరపున 10 వేల మందికి పులిహోర, సేమ్యాకేసరి, వెజిటబుల్‌ బిర్యానీలు పంపిణీ చేశారు. ఈ సంఘం ప్రతినిధులు శాశ్వత గౌరవ అధ్యక్షుడు అంబికా రాజా, అధ్యక్షులు మద్దుల రవీంద్ర, పైడేటి రఘు, సత్యకుమార్‌, దేసు నరసింహారావు, ఎల్‌జీ శ్రీనివాస్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు.

జాతర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

ఏలూరు క్రైం: నగరంలో జాతర ప్రాంతాలను ఎస్పీ కిశోర్‌ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా పరిశీలించారు. ఆర్‌ఆర్‌పేట, పవర్‌పేట, ఏలూరు వన్‌టౌన్‌, చందన బ్రదర్స్‌ రోడ్లను సందర్శించి శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణ, జనసందోహ నియంత్రణపై సిబ్బందికి సూచనలు చేశారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ, ఏలూరు టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. పవర్‌ పేటలో కొర్ల బండి ఊరేగింపు సందర్భంగా నూకాలమ్మ గుడి సెంటర్‌ ప్రాంతంలో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ సిబ్బందితో కలిసి ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Jan 27 , 2026 | 01:04 AM