Share News

జన జాతర!

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:59 AM

గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా ఆదివారం ఏలూరు నగరం జనసంద్రమైంది. మహాకుంభ నివేదనల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఎటు చూసినా.. జనం సందడితో ప్రధాన రోడ్లు, వీధులు కిక్కిరిశాయి.

జన జాతర!
తూర్పు వీధి మేడలో కొలువుదీరిన అమ్మవార్లు

టెంట్లు, షామియానాల హోరు

నాన్‌వెజ్‌ వంటకాలతో ఘుమఘుమలు

మార్కెట్లు, మాంసం దుకాణాలు కిటకిట

పెరిగిన మద్యం అమ్మకాలు

తప్పని ట్రాఫిక్‌ తిప్పలు

గంగానమ్మ జాతర ముగింపు సందర్భంగా ఆదివారం ఏలూరు నగరం జనసంద్రమైంది. మహాకుంభ నివేదనల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.ఎటు చూసినా.. జనం సందడితో ప్రధాన రోడ్లు, వీధులు కిక్కిరిశాయి. ఉదయం ఏలూరు వైపు వచ్చిన రైళ్లు, ఆర్టీసీ బస్సులు జనంతో కిటకిటలాడాయి. ఆటోలకు డిమాండ్‌ పెరగడంతో ఆమాంతంగా రేట్లు పెంచేసి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.దాదాపుగా జాతర పేరిట నగరానికి 50వేల మందికి పైగా బంధుగణం వచ్చి ఉంటారని అంచనా. సోమవారం అమ్మవార్లను ఊరిపొలిమేరలకు సాగనంపనున్నారు.

ఏలూరు,జనవరి 25(ఆంఽధ్రజ్యోతి): మూడు నెలలు విరామం తర్వాత ఏలూరు నగరానికి పెద్ద పండుగ జరి గింది. జాతర పేరిట ఐదుచోట్ల అమ్మవార్లను నిలబెట్టడంతో శుభకార్యాలకు, వివిధ పండుగలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జాతర ముగింపు ఉత్సవం సరంభానికి మునుపెన్నడూ చూడని విధంగా బంధుగణం ఆదివారం ఏలూరుకు పోటెత్తారు. బంధువులకు వివిధ రకాలు వంటలు వండి వార్చడానికి ప్రతీ వీధిలో కనీసం ఐదారు టెంట్లు వరకు వెలిశాయి. షామియానాల దుకా ణాలు ఖాళీ చేశారా... అన్న రీతిలో టెంట్లు వేయడం విశేషం. కొన్ని కుటుంబాల్లో 70 నుంచి 100 మంది కుటుం బీకుల వరకు ఈ జాతర పేరుతో బంధువుల ఇంటి గడ పలు తొక్కారు. ఏ వీధి చూసినా ఆప్యాయతలు, ప్రేమగా పలకరింపులు.. కొసరి.. కొసరి వడ్డింపులతో సందడిగా మారింది. పధాన రహదారులు, వీధుల్లో ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రంగా తలెత్తాయి. ఆర్‌ఆర్‌పేట, కొత్తపేట, 12 పంపుల సెంటర్‌, నూకాలమ్మగుడి సెంటర్‌, ఏకేజీ సెంటర్‌, వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాలు జనం సందడితో కిటికిటలా డాయి. వివిధ దేశాల్లో సాఫ్ట్‌వేర్‌, ఇతర టెక్నాలజీ రంగం లో పనిచేస్తున్న యువ ఉద్యోగులు జాతర సందర్భంగా స్వస్థలానికి వచ్చారు. జాతర అంటే పిండి వంటకాలు,వివిధ నాన్‌వెజ్‌ వంటకాలతో పసందు చేసుకున్న వారు కొంద రైతే... మందుబాబులు అయితే భారీగా మద్యం కొనుగోలు చేయడం కన్పించింది. కూల్‌ డ్రింక్‌ షాపులు, పాల ప్యాకె ట్‌లు అమ్మేబూత్‌లు, కిరాణా దుకాణాలకు వద్ద సంక్రాంతికి కూడా లేని విధంగా సందడి వాతావరణం నెలకొంది.

మార్కెట్లు కిటకిట...

ఏలూరు నగరంలో చేపల తూము, ఎన్‌ఎస్‌ కూర గాయల మార్కెట్‌, ఆదివారపుపేట మార్కెట్లలో కొనుగోలు దార్లతో సందడిగా మారిపోయింది. ఆదివారం కావడంతో నాన్‌వెజ్‌ అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. చాలాచోట్ల మేకలు, గొర్రెలు, నాటుకోళ్లు వంటకాలతో మజాను ఆస్వా దించారు.

Updated Date - Jan 26 , 2026 | 12:59 AM