Share News

జగన్‌ భూతాన్ని బిరడాలో బిగించాం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:28 AM

గత 2024వ సంవత్సరంలో జగన్‌మోహన్‌ రెడ్డి అనే భూతాన్ని ఒక సీసాలో పెట్టి బిరడా బిగించామని, సీసాలో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి బయటకు రాకపోవడమే ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

జగన్‌ భూతాన్ని బిరడాలో బిగించాం
సమావేశంలో మాట్లాడుతున్న నిమ్మల రామానాయుడు

బయటకు రాకుంటేనే ప్రజలకు శ్రీరామరక్ష : నిమ్మల

భీమవరం టౌన్‌, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గత 2024వ సంవత్సరంలో జగన్‌మోహన్‌ రెడ్డి అనే భూతాన్ని ఒక సీసాలో పెట్టి బిరడా బిగించామని, సీసాలో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డి బయటకు రాకపోవడమే ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తెలుగుదేశంపార్టీ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా భీమవరంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి తనదైన శైలిలో జగన్‌పై నిప్పులు చెరిగారు. అరుంధతి సినిమాలో పశుపతిని సమాధి చేయగా ఆ తర్వాత బయటకు వచ్చిన పశుపతి బీభత్సం సృష్టిస్తాడన్నారు. ఇదే తరహా లో బిరడా నుంచి జగన్‌ బయటకు వస్తే (గెలిస్తే) కక్ష సాధింపులు, విధ్వంసాలు మొదలవుతాయని మంత్రి అన్నారు. అధికారంలో లేకపోయినా రపా, రపా అంటున్నారని, అధికారంలో ఉన్న మేము అదే పనిచేస్తే వైసీపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏడాదిన్నర తరువాత పాదయాత్ర చేస్తానని జగన్‌ అంటున్నారని, దానిలోనే ఆయన స్వార్ధం తెలుస్తోందన్నారు. ఆయనకు ప్రజలపై ప్రేమ కాదని, అధికారంపైనేనని స్పష్టం అవుతోందని నిమ్మల రామానాయుడు అన్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:28 AM