Share News

ప్రగతి పథంలో పయనం

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:28 AM

అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి బాటలో తీసుకు వెళుతున్నాం. ప్రజల సంతృప్తిస్థాయిని పెంచి, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాఽధించి రెండో స్థానంలో నిలిపాం. అన్ని రంగాల్లోను ప్రథమ స్థానంలో నిలిపేలా పోటీ పడుతున్నాం’ అని కలెక్టర్‌ నాగరాణి అన్నారు.

ప్రగతి పథంలో పయనం

స్వర్ణాంధ్ర విజన్‌–2047 సాధనే పశ్చిమ లక్ష్యం

ఖరీఫ్‌లో 4.43 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

24 గంటల్లో రైతులకు రూ.1032 కోట్లు జమ

రూ.2,67,633 కోట్ల పంట రుణాలు అందజేత

ఎన్టీఆర్‌ వైద్యసేవకు రూ.128.27 కోట్లు

రూ.353 కోట్లతో 412 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి

77వ గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ నాగరాణి

భీమవరం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లాను ప్రగతి బాటలో తీసుకు వెళుతున్నాం. ప్రజల సంతృప్తిస్థాయిని పెంచి, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాఽధించి రెండో స్థానంలో నిలిపాం. అన్ని రంగాల్లోను ప్రథమ స్థానంలో నిలిపేలా పోటీ పడుతున్నాం’ అని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. 77వ గణతంత్ర దినో త్సవం సందర్భంగా భీమవరంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వంద నాన్ని స్వీకరించారు. అనంతరం ఈ ఏడాది జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు.

వ్యవసాయంలో అగ్రగామి

‘ఆర్థిక, సామాజిక, మానవ వనరుల అభి వృద్ధిలో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్‌–2047 సాధనే ధ్యేయంగా జిల్లాలో ప్రణాళికలు అమల్లో పెట్టాం. పశ్చిమ గోదావరి వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉంది. వ్యవసాయ, ఉద్యాన ఉత్ప త్తులను వృద్ధి చేస్తూ మార్కెటింగ్‌ అవకాశాలను పెంపొందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా 1.03 లక్షల మంది రైతులకు ఆర్థిక సహాయం అందించాం. జిల్లాలో 72,354 మంది కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు జారీచేసి రూ.169.33 కోట్లు ఆర్థిక సాయం అందజేశాం. ఇప్పటి వరకు 68 వేల 479 మంది రైతుల నుంచి 4.43 లక్షల మెట్రిక్‌ టన్నుల ఖరీఫ్‌ ధాన్యం సేకరించి, 24 గంటల వ్యవధిలోనే రూ.1032 కోట్లు అందజే శాం. జిల్లాలో రూ.2,67,633 కోట్ల పంట రుణాలు అందించి రైతులకు ఆర్థిక చేయూతను అం దించాం. ఉద్యాన సాగును 19,199 హెక్టార్లకు విస్తరించి 3,86,057 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తు లతో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. పాడి సంపదలోనూ జిల్లా ప్రగతి కనబరుస్తోంది. పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా 1,936 మంది రైతులకు 85 శాతం రాయితీతో రూ.7.38 కోట్లు రుణాలు అందించాం. మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల ద్వారా 15,895 పాడి పశువులకు గత ఏడాది వైద్యం అందించాం.

ఆక్వా అదరహో..

జిల్లాకు ఆయువు పట్టు అయిన ఆక్వా రంగం పై 24,677 మంది రైతులు ఆధారపడి చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు అప్సడా చట్టం కింద 63 వేల ఎకరాల్లో రిజి స్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. 36 వేల ఎకరాల్లో రిజిస్ర్టేషన్‌ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. రైతులను ప్రోత్సహిస్తున్నాం. పదో తరగతి ఫలి తాల్లో 2023 నాటికి 65.93 శాతం ఉత్తీర్ణత ఉండగా ఇప్పుడు 82.15 శాతానికి చేరింది.

తగ్గిన మాతృ మరణాలు

మాతా శిశు ఆరోగ్య సేవల్లో భాగంగా మూడేళ్ల నుంచి వంద శాతం ఆసుపత్రి ప్రసవాలను సాధించాం. మాతృ మరణాల రేటును తగ్గిం చాం. డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా రూ. 128.27 కోట్లతో 56,895 మందికి ఉచిత శస్త్ర చికిత్సలు అందించాం. మౌలిక సదుపాయాల కల్పనలో పాలకొల్లు, ఆకివీడులల్లో డయాలసిస్‌

కేంద్రాలు, భీమవరంలో మాతృ పాల నిధి, తణుకులో కీమోథెరిఫీ, పాలియేటిట్‌ కేర్‌ యూనిట్లను ఏర్పాటు చేశాం. 1826 అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ 51 వేల మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోష కాహా రాన్ని అందిస్తున్నాం. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జనవరిలో 2.17 లక్షల మందికి 94.20 కోట్ల పింఛన్లు అందజేశాం.

మౌలిక వసతుల కల్పనలో..

జిల్లాలో రూ.353 కోట్లతో 412 కిలోమీటర్ల మీటర్ల రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులు జరుగు తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 124.66 కోట్లతో 2,828 ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలు నెలకొల్పేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాలలో రైతులకు రాజ ముద్రలతో కూడిన 56 వేల పట్టాదారు పాస్‌ పుస్తకాలు అందించాం. శాంతి భద్రతల పరిర క్ష ణ, పౌర సేవల్లో అధికారుల ఎంతో కృషి చేస్తు న్నారు’ అని కలెక్టర్‌ నాగరాణి అభినందించారు.

341 మందికి ప్రశంసా పత్రాలు

జిల్లాలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న పోలీస్‌, ప్రజా రవాణా, దేవాదాయ ధర్మదాయ, మునిసిపాల్టీ, మెప్మా, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, డీసీహెచ్‌ఎస్‌, కమర్షియల్‌ టాక్‌ ్స, అగ్నిమాపక, వ్యవసాయ, విద్యాశాఖలతోపాటు కలెక్టరేట్‌లోని వివిధ శాఖలకు చెందిన 341 మందికి కలెక్టర్‌ నాగరాణి ప్రశంసా పత్రాలను అందించారు. వీరిలో 27 మంది జిల్లా అధికారులు వున్నారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, జేసీ రాహుల్‌కుమార్‌ రెడ్డి, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.

భారత్‌ను కీర్తిస్తున్న దేశాలు : మంత్రి నిమ్మల

పాలకొల్లు టౌన్‌ : భాతరదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని తన క్యాంపు కార్యాలయం వద్ద పోలీసు గౌరవ వందనం స్వీకరించి, గాంధీజీ, అంబేడ్కర్‌ చిత్ర పటాలకు పూల మాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

ప్రగతి పథంలో పశ్చిమ : జేసీ

భీమవరం టౌన్‌ : పశ్చిమ గోదావరి జిల్లా పారిశ్రామిక, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్‌ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

హక్కుల వెనుక త్యాగాలు : ఎస్పీ

భీమవరం క్రైం: స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించిన మహోన్నత గ్రంథం మన రాజ్యాంగం. నేడు మనం అనుభవిస్తున్న హక్కుల వెనుక ఎందరో అమర వీరుల త్యాగాలు ఉన్నాయి’ అని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి అన్నారు. ఎస్పీ క్యాంప్‌ కార్యాలయంలో జాతీయజెండాను ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు.

జిల్లా ఉత్తమ అధికారులకు అవార్డులు

కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందుకుంటున్న అధికారులు డీఆర్వో శివన్నారాయణరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల నోడల్‌ అధికారి దోసిరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు, హౌసింగ్‌ పిడి జి.పిచ్చియ్య, చేనేత అధికారి కె.అప్పారావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ఉషారాణి, డ్వామా పీడీ అప్పారావు, డీఎంహెచ్‌వో గీతాబాయి, డీపీఆర్‌వో నాగేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సూర్యనారాయణ, ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి, పౌరసరఫరాల మేనేజర్‌ ఇబ్రహీం, క్రీడా శాఖ అధికారి మోహన్‌దాస్‌, జిల్లా గణాంకాల అధికారి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ అధికారి అరుణకుమారి, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌, డీపీవో రామనాథ్‌రెడ్డి, డీఈవో నారాయణ, మత్స్యశాఖ ఏడీరాజు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాస్‌, బీసీ సంక్షేమాధికారి సూరిబాబు, పరిశ్రమల శాఖ అధికారి మంగపతి రావు, భీమవరం ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తణుకు మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌కుమార్‌, ఎస్‌ఎస్‌ఏ పీవో శ్యామ్‌సుందర్‌, ఏఎస్పీ భీమారావు. చిత్రంలో ఎస్పీ నయీం అస్మి, జేసీ రాహుల్‌కుమార్‌, కొత్తపల్లి

Updated Date - Jan 27 , 2026 | 01:28 AM