వాసవీధామ్‌లో వార్షికోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:30 AM
పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండగా మార్చడానికి క్యాబినెట్‌లో పాస్ చేసి జీవో తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు అన్నారు.
వాసవి పెనుగొండ, జనవరి 27(ఆంధ్రజ్యోతి):పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండగా మార్చడానికి క్యాబినెట్‌లో పాస్ చేసి జీవో తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు అన్నారు. పెనుగొండ వాసవి శాంతి ధామ్ లో వాసవి ౠషి గోత్ర సువర్ణ మందిరం ఏడవ వార్షికోత్సవం మంగళ వారం ప్రారంభమైంది. ధామ్‌లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ వాసవి పెనుగొండగా పేరు రావడానికి ఏడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేశామని ఇ ప్పుడు దీనికి ప్రభుత్వం ఎంతో సహకరించిందన్నారు. వార్షికోత్సవాలకు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, ఇండస్ట్రీస్ అండ్ కామర్సు మినిస్టర్ టీజీ భరత్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, శ్రీరామ్ తాత య్య, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులను ఆహ్వానించినట్టు తెలిపారు.