తుఫాన్ ముప్పు తప్పింది. ఎండ బాగా కాస్తుంది.. ఇక వరి మాసూళ్లు చేసుకుందామని కోతలు చేపట్టిన రైతులకు సోమవారం ఒక్కసారిగా ముంచెత్తిన వర్షం మరింత కష్టాల్లోకి నెట్టింది.
కార్తీక సోమవారం పంచారామ క్షేత్రమైన గునుపూడిసోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు.
ఏటా గోదావరి వరదలు వస్తే పిల్లా పాపలతో తట్టాబుట్టా సర్దుకుని మెరక ప్రాంతాలకు తరలి వెళ్లాలి.. రహదారులు మూసుకు పోతాయి.
ప్రధాన మంత్రి ఆవాస యోజన పఽథకంలో 3 కేటగిరీ ఇళ్ల నిర్మాణానికి కుస్తీ పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అప్పగించారు.
బంగారం తక్కువ ధరకు ఇస్తున్నామని నమ్మించి, తర్వాత వారిని బెదిరించి డబ్బులు దోచుకుపోయే నలుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను తాడేపల్లిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు.
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని జిల్లా నుంచి సేకరించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలనులో పౌరసరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్ సోమవారం తొలి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
చింతల పూడి పథకం ఫేజ్–1కి 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన జరిపారు. అనంతరం టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.4,909 కోట్లతో (1,2 ఫేజ్లు) పనులు చేపట్టారు.
సుద ర్శన పుష్కరిణిలో హంస వాహనంపై చిన వెంకన్న ఉభయనాంచారులతో ఆదివారం రాత్రి జల విహారం చేశారు.
చిన్న వెంకన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.
గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.