Share News

షిర్డీ సాయి ఆలయాభివృద్ధికి రెండెకరాలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:05 AM

ఐఎస్‌ జగన్నాథపురం సుందర గిరిపై కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాభివృద్ధికి నిర్వాహకులు కొచ్చర్ల కోట వెంకట కామరాజు భార్య కొచ్చర్లకోట లలితమ్మకు రెండెకరాల భూమిని కేటా యిస్తూ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

షిర్డీ సాయి ఆలయాభివృద్ధికి రెండెకరాలు
సుందర గిరిపై కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయం

రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర..

ద్వారకాతిరుమల, జనవరి 28(ఆంధ్రజ్యోతి):ఐఎస్‌ జగన్నాథపురం సుందర గిరిపై కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాభివృద్ధికి నిర్వాహకులు కొచ్చర్ల కోట వెంకట కామరాజు భార్య కొచ్చర్లకోట లలితమ్మకు రెండెకరాల భూమిని కేటా యిస్తూ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సర్వే నెంబరు 425–194లో కొండ పోరంబోకుగా ఉన్న ఈ భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున రెండెకరాల భూమికి రూ.60 లక్షలు చెల్లిస్తారు. యూడీఏ నుంచి డీపీఆర్‌, ఎన్‌వోసీ సమర్పణకు లోబడి ఈ భూమిని కేటాయిస్తారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jan 29 , 2026 | 12:05 AM