Share News

పుష్కర్‌ ఘాట్‌లు పరిశీలన

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:57 PM

రాబోయే గోదావరి పుష్కరా లను పురస్కరించుకుని ఇరిగేషన్‌ అధికారులు బుధవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గోదావరి తీరంలో ఉన్న పుష్కర్‌ఘాట్‌లను పరిశీలించారు.

పుష్కర్‌ ఘాట్‌లు పరిశీలన
కుక్కునూరు పుష్కర్‌ఘాట్‌లో కొలతలు కొలుస్తున్న అధికారులు

కుక్కునూరు, జనవరి 28(ఆంధ్రజ్యోతి):రాబోయే గోదావరి పుష్కరా లను పురస్కరించుకుని ఇరిగేషన్‌ అధికారులు బుధవారం కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గోదావరి తీరంలో ఉన్న పుష్కర్‌ఘాట్‌లను పరిశీలించారు. వేలేరుపాడు పుష్కర్‌ఘాట్‌తో పాటు కుక్కునూరు మండలంలోని కుక్కునూరు, కౌండిన్యముక్తి, పెదరావిగూడెం ఘాట్‌లను సందర్శించారు. ఘాట్‌లకు వెళ్లే రహదారులను పరిశీలించడంతో పాటు ఘాట్‌ల నుంచి గోదావరిలోకి వెళ్లి స్నానం చేయడానికి ఏర్పాటు చేయా ల్సిన మెట్లను పరిశీలించారు. అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేయ డానికి కొలతలు తీసుకున్నారు. రంపచోడవరం డివిజన్‌కు చెందిన అధికారుల సూచనల మేరకు ఇరిగేషన్‌ డీఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ హరి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 11:57 PM