నరసన్న కల్యాణోత్సవాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:08 AM
శ్రీలక్ష్మీ నారసింహుని దివ్యక్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభంకానున్న కల్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది.
నేడు వరుడు కానున్న లక్ష్మీనరసింహస్వామి
ముస్తాబైన సుందరగిరి ప్రాంగణం
ద్వారకాతిరుమల, జనవరి28(ఆంధ్రజ్యోతి): శ్రీలక్ష్మీ నారసింహుని దివ్యక్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభంకానున్న కల్యాణ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 10–15 గంటలకు స్వామిని పెండ్లి కుమారునిగాను, వల్లీ దేవసేన అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేయనున్నారు. చినవెంకన్న ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాఽథపురంలోని సుందరగిరిపై కొలువైన స్వయం వ్యక్తుని ఆలయంలో భీష్మఏకాదశి పర్వదినం మొదలుగా వచ్చేనెల మూడో తేదీ వరకు కల్యాణమహోత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయ ద్వారాలకు పాలిష్‌లతో తుదిమెరుగులు పూర్తయ్యాయి. ఆలయాన్ని, పరిసరాలను విద్యుత్‌దీప తోరణాలతో సుందరీకరించారు. ఆలయ ప్రాంగణంలో పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 31న ఉదయం 11–10 గంటలకు జరుగనున్న స్వామివారి కల్యాణాన్ని కొండ దిగువనున్న కల్యాణ మండపంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.