Share News

వంతెనల వంతు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:17 AM

రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లుగానే వంతెనల నిర్మాణాలపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.

వంతెనల వంతు
కోపల్లె బొండాడ డ్రెయిన్‌పై శిథిలావస్థకు చేరిన వంతెన

ప్రతిపాదనలు పంపాలని ఆర్‌అండ్‌బీకి ప్రభుత్వం ఆదేశాలు

జిల్లాలో రూ.191 కోట్లతో కొత్తవి 37 నిర్మించాలి

రూ.13 కోట్లతో 134కు మరమ్మతులు చేయాలి

ఇప్పటికే 3 వంతెనలకు రూ.36 కోట్లు మంజూరు

పూర్తవుతున్న రోడ్ల నిర్మాణాలు.. మరమ్మతులు

భీమవరం రూరల్‌, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లుగానే వంతెనల నిర్మాణాలపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లాలో వీటి పరిస్థితిపై ప్రతిపా దనలు పంపించాలని ఆర్‌అండ్‌బీ అధికారుల ను ఆదేశించింది. వీటిలో తొలుత అత్యవసర మైన వాటిని గుర్తించి ప్రత్యేకంగా కోట్‌ చేయా లని సూచించింది. ఈ మేరకు 37 వంతెనలను కొత్తగా నిర్మించాలని వీటికి రూ.191 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అలాగే 134 వంతెనలకు మరమ్మతులు చేయాలని ఇందుకు రూ.13 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు రూపొందించింది. తొలుత శిథిలావస్థకు చేరిన వాటికి ప్రాధాన్యత ఇచ్చి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్‌పై వున్న రెండు వంతెనల అప్రోచ్‌ ఏర్పాటుకు ఇటీవల రూ.24 కోట్లు, కాళ్ల మండలం కోపల్లె వంతెనకు రూ.12 కోట్లు మంజూరుచేసింది. ఇది టెండర్‌ దశను పూర్తి చేసుకుని, నిర్మాణానికి సిద్ధమైంది.

వంతెనలపై వెనకడుగు

రహదారుల విస్తరణ, అభివృద్ధికి కోట్లు వెచ్చిస్తారు. కాని ఆ రహదారిలో వంతెనను పట్టించుకోరు. సింగిల్‌ రోడ్లు డబుల్‌ రోడ్లుగా మారినా వంతెనలు మాత్రం సింగిల్‌గానే వున్నా యి. దీనికి కారణం రెండు పనులు ఒకేసారి కుదరవు. వంతెన నిర్మాణ ఎస్టిమేషన్‌ వేయడానికి ఆ ప్రాంత సాయిల్‌ టెస్ట్‌లు కెపాసిటీ చెక్‌ చేయాలి. ఇరిగేషన్‌ శాఖ పర్మిషన్‌ రావాలి. కాలువలు డైవర్ట్‌ చేయాలి. వాహనాలు వేరే రహదారి మళ్లించాలి. దీని నిర్మానానికి సుమారు ఏడాది పడుతుంది. ఈ కారణాలతో వంతెనలు పూర్తిగా శిథిలమవుతున్నాయి.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని నెలల్లోనే రహదారుల సమస్యలపై దృష్టి సారించింది. 2024 డిసెంబరులో రూ.40 కోట్లతో జిల్లాకు గుంతలు పూడిక పనులు చేపట్టింది. తర్వాత 250 కి.మీ. రహదారి అభివృద్ధికి రూ.150 కోట్లపైన నిధులు మంజూరుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని రహదారులను అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తోంది.

వైసీపీ హయాంలో..

గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభి వృద్ధి కుంటిపడేలా చేసింది. దానికి తగ్గట్లుగానే ఏ వంతెన నిర్మాణంపైన దృష్టి పెట్ట లేదు. మరమ్మతులు చేయలేదు. దీంతో కూ టమి ప్రభుత్వానికి రహదారులు, వంతెనలకు భారీస్థాయిలో పనులు చేయాల్సి వస్తోం ది. వైసీపీ హయాంలో కొన్ని పనులకు నిర్ణ యించి టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముం దుకు వెళ్లకపోవడంతో ఏ పని జరగలేదు. తాజాగా ప్రతిపాదనలు పంపడంతో వీటి సమస్య తీరనుంది. అత్యవసరంగా నిర్మించా ల్సిన వాటిలో జల్లి కాకినాడ వద్ద, మేడపాడు, నరసాపురం రోడ్డులో వంతెనలు వున్నాయి.

Updated Date - Jan 30 , 2026 | 12:17 AM