Share News

బుట్టాయగూడెం ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:19 AM

బుట్టాయగూడెం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి నోటిఫికే షన్‌ విడుదలైనట్టు ఎంపీడీవో కె.జ్యోతి బుధవారం తెలిపారు.

 బుట్టాయగూడెం ఎంపీపీ  ఎన్నికకు నోటిఫికేషన్‌

బుట్టాయగూడెం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): బుట్టాయగూడెం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నుంచి నోటిఫికే షన్‌ విడుదలైనట్టు ఎంపీడీవో కె.జ్యోతి బుధవారం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వు లు కార్యాలయానికి అందాయన్నారు. ఫిబ్రవరి 4న ప్రత్యక్షంగా చేతులు ఎత్తే పద్ధతిలో ఎంపీపీ ఎన్నిక నిర్వహి స్తామన్నారు. ఇటీవలవరకు ఎంపీపీగా పనిచేసిన కారం శాంతి పనితీరుపై అసంతృప్తితో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆర్డీవోను మిగిలిన ఎంపీటీసీలు కోరారు. దీంతో 2025 ఫిబ్రవరి 26న అవిశ్వాసం పెట్టగా 15 మంది ఎంపీటీసీలకు 11 మంది హాజరై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో ఆమె పదవిని కోల్పోయారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. ఇలా ఉండగా ఎంపీపీ పదవి కోసం పలువురు ఎంపీటీసీలు ప్రయత్నిస్తున్నారు. కోయరాజమండ్రి ఎంపీటీసీ, వైస్‌ ఎంపీపీ అయిన గుగ్గులోతు మోహన రావు, బుట్టాయగూడెం–2కు ఎంపీటీసీ తెల్లం రమణ ఎంపీపీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంపీపీ పదవి మహిళకు రిజర్వు కావడంతో మరోసారి మహిళకే అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ ప్రధానంగా వినబడుతోంది. వీరితోపాటు లక్ష్ముడుగూడెం, ఇతర ఎంపీటీసీ సభ్యులు రేసులో ఉన్నట్టు సమాచారం.

Updated Date - Jan 29 , 2026 | 12:19 AM