శ్రీవారి హుండీల ఆదాయం రూ.2.24 కోట్లు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:16 AM
ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 20 రోజుల కాలానికి జరిగిన లెక్కింపులో చినవెంకన్నకు నగదు రూపేణా రూ.2.24 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
ద్వారకాతిరుమల, జనవరి28(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల చిన వెంకన్నకు హుండీల సొమ్ము లెక్కింపు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం లభించింది. గడచిన 20 రోజుల కాలానికి జరిగిన లెక్కింపులో చినవెంకన్నకు నగదు రూపేణా రూ.2.24 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. స్థానిక ప్రమోద కల్యాణమండప ఆవరణలో గురువారం అత్యంత భద్రతాఏర్పాట్ల నడుమ హుండీల సొమ్ము లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా లభించిన రూ.2,24,23,765 నగదుతోపాటుగా భక్తులు సమర్పించిన కానుకల రూపేణా 174గ్రాముల బంగారం, 3.594 కేజీల వెండి లభించాయన్నారు. రద్దయిన పాతనోట్లు రూ.500(5), 2000(10)తో పాటుగా విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. శ్రీవారి హుండీల ద్వారా రోజుకు సగటున రూ.11.21లక్షల ఆదాయం లభించినట్టు ఈవో తెలిపారు.
అభయాంజనేయుడు హుండీ ఆదాయం రూ.12 లక్షలు
పెదపాడు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పెదపాడు మండలం అప్పనవీడులోని అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద బుధవారం నిర్వహించిన హుండీల సొమ్ము లెక్కింపు ఆదాయం రూ.12,44,579 లభించిందని ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. దేవాల య ఆవరణలో అధికారులు, భక్తుల సమక్షంలో 85 రోజులకు హుండీల సొమ్ము లెక్కింపు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తనిఖీదారు వి.సురేష్, ధర్మకర్తల మండలి సభ్యులు మూల్పూరి గోపీచంద్, పాబోలు లక్ష్మీప్రియ, అక్కప్రోలు సునీత, కొక్కిరపాటి రామచంద్రయ్య, ఈవో పి.తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.