Share News

కలగానే..

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:59 PM

కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలకు ఇప్పటికీ సీహెచ్‌ సీ మంజూరు కాక ఈ మండలాల ప్రజలకు స్థాని కంగా మెరుగైన వైద్యం అందడం లేదు.

కలగానే..
కుక్కునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ముంపు మండలాల ప్రజలకు సరైన వైద్యసేవలు అందక ఇక్కట్లు

కుక్కునూరు,వేలేరుపాడు మండలాల్లో 60 వేల మందికి పైగా జనాభా

మెరుగైన వైద్యం కోసం భద్రాచలం, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సిందే..

ప్రతిపాదనల్లోనే కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు

కుక్కునూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, తెలంగాణ రాష్ట్ర విభజన 2014 జూన్‌ 2న జరిగిన సమయంలో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ముంపు పేరుతో తెలంగాణ నుంచి ఆంధ్రాలోని ఏలూ రు జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈరెండు మండలాల ప్రజలకు అత్యవసర వైద్యం కోసం 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెంకు వెళ్లాల్సిన పరిస్థితులు గుర్తించి అప్పటి జిల్లా వైద్యశాఖాధి కారులు, ప్రజాప్రతినిధులు కుక్కునూరులో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపా దనలను సంబంధిత శాఖకు పంపించారు. సాధార ణంగా జిల్లా ఆసుపత్రి 30–40 కిలోమీటర్లు దూరం ఉంటే స్థానికంగానే సీహెచ్‌సీ ఏర్పాటు చేయాల్సి ఉం ది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గోదావరి అవతల వైపు ఉన్న కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక, చింతూరు మండలాలూ ఆంధ్రాలోకి వచ్చాయి. ఆ మండలాల్లోని కూనవరంలో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ ఉంది. చింతూరులో మండలంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ని తాజాగా వందపడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. కాని కుక్కు నూరు, వేలేరుపాడు మండలాలకు ఇప్పటికీ సీహెచ్‌ సీ మంజూరు కాక ఈ మండలాల ప్రజలకు స్థాని కంగా మెరుగైన వైద్యం అందడం లేదు.

రోగం వస్తే 70 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 60 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. కుక్కునూరు మండ లంలో కుక్కునూరు, అమరవరంలో, వేలేరుపాడు మండలంలో వేలేరుపాడు, కోయిదాలో పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రాథమిక ఆసుపత్రులే కావడంతో పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఇక్కడ ధైర్యంగా కాన్పులు చేయలేని పరిస్థితి. అత్యవసర వైద్యం కోసం భద్రాచలం, జంగారెడ్డిగూడెం రిఫర్‌ చేస్తున్నారు. యాక్సిండెంట్‌, పురుగు మందు తాగిన కేసులు, పాముకాటు, తదితర ఎమర్జెన్సీ కేసులన్ని రిఫర్‌ చేయాల్సిన పరిస్థితి. దీంతో ఈ మండలాల ప్రజలు వైద్యానికి ఇబ్బందులు పడుతున్నారు. కమ్యూ నిటీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటయితే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు, స్కానింగ్‌ సెంటర్‌, బ్లడ్‌బ్యాంక్‌ ఏర్పాటు, శస్త్ర చికిత్సలు వంటి సేవలు అందుబాటు లోకి వస్తాయి. ఇప్పటికైనా కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సీహెచ్‌సీ ఏర్పాటుకు కృషి చేస్తా

– చిర్రి బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం కోసం సీహెచ్‌సీ ఏర్పాటుకు కృషి చేస్తాను. సీహెచ్‌సీ ఏర్పాటు చేస్తే ఆ రెండు మండ లాలకు ప్రజలకు వైద్యసౌకర్యం మెరుగవుతుంది. సంబంధిత అధికారులతో దీనిపై మాట్లాడతాను.

సీహెచ్‌సీ మంజూరుకు ప్రతిపాదన

– డాక్టర్‌ సురేశ్‌కుమార్‌, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, కేఆర్‌.పురం, ఐటీడీఏ

రెండు మండలాలకు కలిపి సీహెచ్‌సీ మంజూరు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. సీహెచ్‌సీ ఏర్పా టయితే స్థానికంగానే వైద్యం అందుతుంది. జంగా రెడ్డిగూడెం వరకు రావాల్సిన పరిస్థితి ఉండదు.

Updated Date - Jan 28 , 2026 | 11:59 PM