Share News

వరుడైన నారసింహుడు

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:26 AM

శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్‌ జగన్నాఽథపురంలో లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

వరుడైన నారసింహుడు
పెండ్లికుమారుడు, కుమార్తెలుగా నరసన్నను, అమ్మవార్లు

సుందరగిరిపై ఉత్సవాలు ప్రారంభం

ద్వారకాతిరుమల, జనవరి29(ఆంధ్రజ్యోతి): శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్‌ జగన్నాఽథపురంలో లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత ప్రత్యేకంగా అలంక రించిన వేదికపై వేదమంత్రోచ్ఛరణలు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల మూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా నరసన్నను, కనకవల్లీ, లక్ష్మీ అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేసి పూజలు చేశారు. వచ్చేనెల మూడో తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. రాత్రి ఆలయంలో అంకురార్పణ, ధ్వజారోహణ, తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఉత్సవ వేడుకల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jan 30 , 2026 | 12:26 AM