ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికకు వివాహం చేస్తున్న సమయంలో అధికారులు అడ్డుకు న్నారు. అయినప్పటికీ బాలిక తల్లి రహస్యంగా వివాహం జరిపేసింది. ఫలితంగా రెండేళ్ల తరువాత ఆ బాలిక గర్భం దాల్చి ప్రసవం సమయంలో బిడ్డను కోల్పోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా క్షీణించింది.
గడచిన నెలల వ్యవధిలో తాడేపల్లిగూడెం సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలో ముగ్గురిపై వేటుపడింది. సబ్ రిజిస్ర్టార్, జాయింట్ సబ్ రిజిస్ర్టార్, జూనియర్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేశారు. జిల్లాలో ఇది పెద్ద సంచలనమే అయ్యింది. సస్పెండ్‌కు కారణమైన రిజిస్ర్టేషన్ వ్యవహారం కూడా రాష్ట్ర స్థాయిలోనే అధికారులు, రాజీకయ నాయకుల వద్ద పంచాయతీ నడచింది.
జిల్లాలో వినాయక నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ అధికారులను ఆదేశించారు.
ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సామాన్యుడిలా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా పర్యటించారు.
జిల్లాలో జాతీయ మైనర్ ఇరిగేషన్ వనరుల గణాంకాల సర్వే ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జిల్లాలో ఓవరాల్‌గా మైనర్ ఇరిగేషన్ వనరులదే పైచేయి అయినప్పటికి గొట్టపుబావులు (లోతు ఎక్కువ, తక్కువ) ఉన్న వాటి సంఖ్య 68,256గా నిర్థారించారు.
ఎరువులు విక్రయాలల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే యాప్‌ను అమలు చేయనుంది.
పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్, సీనియర్ అసిస్టెంట్, గెజిటెడ్ అధికారుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి వచ్చింది.
మహిళల భద్రతపై ప్రజా భిప్రాయంలో ఏలూరు జిల్లా మొదటి స్థానంలోను, గంజాయి అణిచి వేతలో 5వ స్థానంలో నిలిచింది.
ఇంటర్మీడియట్ విద్యారి ్థనులపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న నిడమర్రు జడ్పీ హైస్కూలు ప్లస్ గణితం ఉపాధ్యాయుడు ఐ.వి.ఎస్.ఎస్.ప్రసాద్‌ను డీఈవో వెంకట లక్ష్మమ్మ సస్పెండ్ చేశారు.