గొంతు తడపని భూగర్భ జలాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:16 AM
తణుకు పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల నాణ్యతపై ప్రజల్లో ఆందోళన పెరుగు తోంది. పలుచోట్ల బోరు నీటికి వాసన రావడం, ఉప్పుతనం ఎక్కువగా ఉండటం, నీటిని వినియోగిం చినపుడు చర్మం దురదల రావడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
తణుకు పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాల నాణ్యతపై ప్రజల్లో ఆందోళన పెరుగు తోంది. పలుచోట్ల బోరు నీటికి వాసన రావడం, ఉప్పుతనం ఎక్కువగా ఉండటం, నీటిని వినియోగిం చినపుడు చర్మం దురదల రావడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పట్టణ విస్తరణ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక పోవడం, వ్యవసాయంలో అధికంగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతు న్నాయన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. పట్టణంలో కొన్నిచోట్ల డ్రైనేజీ నీరు నేరుగా భూమిలోకి కలిసిపోవడం, చెరువులు, కాలువల్లో చెత్త వేయడం, నివాసాల్లో వినియోగించే నీరు కూడా కాలువల్లో వదిలేయడం వంటి కారణాలు వల్ల కాలువలు కలుషితం అవుతున్నాయి. ఫలితంగా బోరు నీటిలో నైట్రేట్, ఉప్పు తనం, ఫోరైడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. కలుషిత నీరు వల్ల కడుపు సంబంధిత వ్యాదులు, చర్మ సమస్యలు, పిల్లల్లో ఎదుగుదల లోపం, కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వ్యర్థాలన్నీ కాలువల్లోనే
ఉండ్రాజవరం పంట కాలువ, గోస్తనీ కాలువ, దువ్వ చానల్, నరసాపురం చానల్, అత్తిలి కాలువల్లో మురుగునీటిని మళ్లిస్తున్నారు. పట్టణ, గ్రామాల్లో వినియోగిస్తున్న మురుగునీరంతా పంట కాలువల్లోకి మళ్లించడంతో రైతులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.చనిపోయిన మూగ జీవాల కళేబరాలు, వ్యర్థాలన్నీ కాలువలోనే పడేస్తున్నారు. కాలువ చుట్టుపక్కల నివాసం ఉండేవారు. చాలా వరకు మురుగునీటిని కాలువలోకి వదులుతున్నారు. 2002 సంవత్సరంలోనే అప్పటి మున్సిపల్ కౌన్సిల్ పబ్లిక్ చేతి పంపుల ద్వారా వచ్చే నీరు కలుషితమని, తాగడానికి పనికిరావని బోర్డులు కూడా ఏర్పాటు చేసింది.
ఇలా ఉంటే డేంజరే !
పట్టణ పరిధిలో ప్రవేటుగా బోర్లు వేసుకునే వారికి కేవలం ముప్పయి నుంచి నలభై అడుగుల – లోపే నీరు వస్తుంది. అయితే కేవలం వాడుకోవడానికి, మొక్కలకు మాత్రమే ఉపయోగించుకునేలా ఉంటుంది. అదే పాతూరులో అయితే 130 అడుగుల వరకు బోరు వేయాల్సి ఉంటుంది. పట్టణంలో బోరు నీటిలో నాణ్యతలు చాలా ప్రమాదకర స్థాయిలో ఉంటున్నాయి. పాతూరులో అయితే బోరు 140 అడుగుల లోతు వేయాల్సి ఉంటుంది. అక్కడ నీరు పర్వాలేదు. సజ్జాపురంలో అయితే కేవలం 40 అడు గులకే వస్తుంది. ఇది చాలా ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో తాగడానికి పనికి రాదు. వేల్పూరు రోడ్డులో కూడా బాగా లోపలికి వెళితే తప్ప నీరు పడదు. కాబట్టి అక్కడ నీరు బాగానే ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం నీరు కలర్, హజెన్, యూనిట్స్ మేక్సు 5 నుంచి 25 పాయింట్లు ఉండాలి. 5 కన్నా తక్కువ ఉన్నా, 25 కన్నా ఎక్కువ ఉన్నా తాగడానికి పనికిరావు. కాల్షియం 75 నుంచి 200, క్లోరైడ్ 250 నుంచి 1000, ప్లోరైడ్ 1 నుంచి 1.5, ప్రీ రెసిడ్యుయల్ క్లోరిన్ 0.2 నుంచి 1, ఐరన్ 1, మెగ్నీషియం 30 నుంచి 100, నైట్రేట్ 45, సల్ఫేట్ 200 నుంచి 400 వరకు ఉండాలి. ఈ విధంగా ఉంటే తాగడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.