Share News

పట్టిసీమ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:30 AM

మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజె అభిషేక్‌ గౌడ అన్నారు.

పట్టిసీమ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

పట్టిసీమ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

పోలవరం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజె అభిషేక్‌ గౌడ అన్నారు. మంగళవారం పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాల రెండవ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14నుంచి మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను శుభప్రదంగా జరపాలని అధికారులకు సూచించారు. ఫైర్‌, పోలీస్‌, ఇతర రక్షణ సిబ్బంది తమ శాఖల పరిధిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమర్జెన్సీ బోట్లు, 104, 108 సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహించాలన్నారు. ఇసుక తిన్నెల్లో మంచినీటి సదుపాయం, బట్టలు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల నిర్మాణం తాటాకు గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ విశ్వనాధరాజు మాట్లాడుతూ ఆలయ ప్రాంగణానికి 150 మీటర్ల వరకూ తాము నాలుగు లైన్ల బారికేడింగు, క్యూలైన్లలో పసి పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణకు షిప్టుల వారీగా 450 మంది కార్మికులు 18 మంది డిప్యూటి ఎంపీడీవోల పర్యవేక్షణలో పనిచేస్తారని డీఎల్‌పీవో తెలిపారు. డీఎస్పీ ఎం వెంకటేశ్వరావు, ఆర్డీవో ఎంవి రమణ, ఐటీడీఏ పీవో రాములు నాయక్‌, ఆర్టీసీ ఆర్‌ఎం ఎం షబ్నమ్‌, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:30 AM