ఇక్కడే ఎందుకిలా..?
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:44 AM
ఇరవై నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతున్న కాంట్రాక్టు ఎంపీహెచ్‌ఏ (మేల్) ఉద్యోగుల నియామకాలు తాజాగా మరో మలుపు తిరిగా యి.
విధుల నుంచి తొలగించిన కాంట్రాక్టు ఎంపీహెచ్‌ఏ ఉద్యోగుల్లో అర్హులపై డైలమా
తొలుత జారీ చేసిన జాబితా నిలుపుదల.. పునఃపరిశీలన
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఇరవై నాలుగేళ్లుగా వివాదం కొనసాగుతున్న కాంట్రాక్టు ఎంపీహెచ్‌ఏ (మేల్) ఉద్యోగుల నియామకాలు తాజాగా మరో మలుపు తిరిగా యి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన డీఎస్సీ–2002 రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులైన 205 మంది ఎంపీ హెచ్‌ఏ ఉద్యోగుల్లో పలువురు అనర్హులు వున్నారంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 2024 డిసెంబరులో రాష్ట్ర వ్యాప్తంగా 730 మందిని తొలగించిన విషయం తెలిసిందే. వీరిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగులు 112 మంది ఉన్నా రు. ఉద్యోగ నియామకాలకు విద్యార్హతలను పదో తరగతి, ఇంటర్మీడియట్‌లుగా వేర్వేరుగా నిర్ణయిస్తూ, ఏళ్ల తరబడి సుదీర్ఘంగా కొనసాగిం చిన ఈ రిక్రూట్‌మెంట్‌పై తరచూ వివాదాలు, కోర్టు వ్యాజ్యాలు షరా మామూలేనని చెబు తుంటారు. ఇలా హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల నుంచి తొలగింపునకు గురైన ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కొద్ది నెలల క్రితం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో జీవో 1207 ఆదేశాల ప్రకారం నియమి తులైన 69 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్‌ఏ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆరోగ్య శాఖ డైరెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు ఆదివారం జారీచేశారు. దీనిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. వివాదాస్పదమైన మెమో ఉత్తర్వులు 38060లో నియమితులైన ఉద్యోగులను పునర్నియామ కానికి ఉద్దేశించిన జాబితాలో 69 మందిని చేర్చారని, దీని వెనుక డీఎంహెచ్‌వో కార్యాలయ ఉద్యోగుల పాత్ర ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తొలుత జారీ చేసిన ఉద్యోగుల పునర్నియామక జాబితాను నిలుపుదల చేయా లని సోమవారం మధ్యాహ్నం డీహెచ్(డైరెక్టర్ ఆఫ్ హెల్త్) నుంచి అత్యవసర ఆదేశాలు అంద డంతో నిలిపివేశారు. ఈ జాబితాలో జీవో 1207 లో వాస్తవంగా ఎంత మంది ఉన్నదీ నిర్ధారించు కునే ప్రక్రియను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టింది. ఆ మేరకు అప్పటి నియామక పత్రాలు, డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించి, మరో దఫా ఆరోగ్యశాఖ డైరెక్టర్ అప్రూవల్ తీసుకున్న తర్వాతే అర్హులైన వారికి పునర్నియామక ఉత్తర్వు లివ్వాలని నిర్ణయించారు. విడుదల చేసిన జాబితాలో తొమ్మిది మంది అనర్హులున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అనర్హులను తొలగిస్తాం
అర్హులైన ఉద్యోగుల జాబితా 2024లోనే తయారు కాగా, అప్పటి నుంచి మౌనంగా ఉండి ఇపుడు వివాదం లేవనెత్తడం సబబు కాదు. పునఃపరిశీలనలో అనర్హులెవరైనా ఉంటే తొలగించి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పునర్నియామకాలు చేస్తాం.
– డీఎంహెచ్‌వో డాక్టర్ పీజే అమృతం