సమస్యలపై సుదీర్ఘ చర్చ
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:28 AM
ఏలూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు మంగళవారం వాడివేడిగా సాగాయి. సమస్యలనే ప్రధానంగా ఈ సమావేశాల్లో జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించా రు.
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సమస్యలు వివరించిన జడ్పీటీసీలు .. సమాధానమిచ్చిన చైర్మన్ పద్మశ్రీ
ఏలూరుసిటీ, పిబ్రవరి 3(ఆంరఽధజ్యోతి): ఏలూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు మంగళవారం వాడివేడిగా సాగాయి. సమస్యలనే ప్రధానంగా ఈ సమావేశాల్లో జడ్పీటీసీ సభ్యులు ప్రస్తావించా రు. జడ్పీ సీఈవో ఎం.శ్రీహరి, ఏలూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, జడ్పీటీసీ సభ్యులతో కలిసి జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ఈ సమావేశాల్లో సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షలో జడ్పీటీసీ సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. కొంతమంది, వికలాంగులకు, వృద్దులకు సక్రమంగా రేషన్ అందటం లేదని, రేషన్ డిపోకు 2కిలోమీటర్లు దూరం ఉన్న ప్రాంతాల్లో సబ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, బియ్యం సరఫరాలో కోత కారణంగా కొంతమంది బియ్యం కార్డుదారులకు బియ్యం 3నెలలకు కూడా ఇవ్వటం లేదని జడ్పీ టీసీ సభ్యులు ఆరోపించారు. హాస్టల్స్‌కు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చే బియ్యం తగ్గించి ఇస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించా లని కోరారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగటం లేదని, ట్యాప్ కనెక్షన్ లేకుండా ట్యాప్ పన్ను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పారిశుధ్య సమస్యలపై ఇటీవల జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్ష చేశామని, సమస్యలను వీడియోల రూపంలో కూడా తెలియజేశామని, చెత్త సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, ఆ సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయో జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ సమాధానమిచ్చారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాను పగటి పూట 9గంటల పాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని, తెల్లవారు జామున వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తోందని జడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని ఏలూరు జిల్లా విద్యుత్ ఎస్‌ఈ సాల్మన్ రాజు హామీ ఇచ్చా రు. జిల్లా అభివృద్ధి నిర్మాణ పనుల్లో అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పద్మశ్రీ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధి, సం క్షేమం జోడు గుర్రాల మాదిరిగా ముందుకు పరుగులు పెడుతున్నాయ న్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో గోదావరి నదిలో నీటిమట్టం తగ్గుతుం దని, వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలు పెట్టాలని నీటిపారు దల శాఖాధికారులను ఆమె ఆదేశించారు. ఇది విద్యార్ధులకు పరీక్షల సమ యమని, ఆర్టీసీ అధికారులు విద్యార్థును బస్సులలో తీసుకెళ్లే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపరచుకుని సమయ పాలన పాటించి ప్రజలకు మంచి సేవలు అందించాలన్నారు. జడ్పీ సమావేశాలకు ఆయా జిల్లాల నుంచి అధికారులు హాజరుకాకపోవడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ సభకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జడ్పీ సిఈఓను ఆదేశించారు. జడ్పీ సిఈఓ ఎం.శ్రీహరి, డిప్యూటి సిఈఓ కె.భీమేశ్వర్, మూడు జిల్లాలకు చెం దిన వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.