‘అంతర పంటల సాగుతో రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని, కొబ్బరి, ఆయి ల్‌పామ్ వంటి ప్రధాన పంటల్లో అంతరంగా కోకో, పసుపు, వక్క, మిరియం వంటి అంతరపంటల సాగును ప్రోత్సహిస్తూ రాష్ట్ర జీడీపీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంబంధిత మాస్టర్ ప్లాన్‌ను తయారు చేయడమే ధ్యేయం’ అని జిల్లా ఉద్యానశాఖాధికారి కె.షాజానాయక్ అన్నారు.
ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా నిర్దేశించారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పార్థివదేహాన్ని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులర్పించారు. ఆళ్ల నాని అకాలమరణంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) పార్థివదేహానికి గురువారం ఏలూరు శ్రీరామనగర్‌లోని ఆయన స్వగృహం వెనుక ఖాళీ స్థలంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనుంది.
భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు మె రుగైన వసతులు, ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పు న ఆధునిక ‘లేబర్ అడ్డాల’ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
మునిసిపల్ ఎన్ని కలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. అయినప్పటికీ నరసాపురం పట్టణ పరిధిలో రాజ కీయం క్రమక్రమంగా వేడేక్కుతోంది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇష్టా రాజ్యంగా భూములను నిషేధిత జాబితాల్లో చేర్చడంతో పేదలు తమ పొలాలు, స్థలాలున్న అనుభవించలేని దుస్థితి. రెండేళ్లు కూటమి ప్రభుత్వం కసరత్తులు చేయడంతో జిల్లాలో ఫ్రీహోల్డ్ భూములకు విముక్తి కలగనుంది.
నూజి వీడు నియోజకవర్గాన్ని పారిశ్రా మిక హబ్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బుధవారం పోతవరపాడు ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశా ల మేరకు నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 20 మద్యం దుకాణాలకు రెన్యువల్ ప్రక్రియ చేపట్టామని ఏలూరు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య తెలిపారు.
జంగారెడ్డిగూడెం డిపో డ్రైవర్ బి.రామారావు అక్రమ సస్పెన్షన్‌ను రద్దు చేయాలని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు,జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపో కా ర్మికులు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.