Share News

ఈ–పంట..

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:35 AM

వ్యవసాయ సాగులో రైతులకు అత్యవసర మైనది ఈ–పంట నమోదు అని చెప్ప వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రతీ రాయితీకి ఈ–పంట నమోదు తప్పనిసరి. జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్‌లో ఈ– పంట నమోదు ముమ్మరంగా సాగుతోంది.

ఈ–పంట..
కాంతంపాలెంలో రైతులతో వరి పొలాన్ని పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌ బాషా

రైతన్నలకు ఉండదు తంటా!

ముమ్మరంగా ఈ–పంట నమోదు

జిల్లాలో మొత్తం విస్తీర్ణం3.91 లక్షల ఎకరాలు ..నమోదైంది 1,84,092 ఎకరాలు

ఈనెల 20వ తేదీ వరకు గడువు

ఏలూరుసిటీ, ఫిబ్రవరి 4 (ఆంరఽధజ్యోతి):

వ్యవసాయ సాగులో రైతులకు అత్యవసర మైనది ఈ–పంట నమోదు అని చెప్ప వచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ప్రతీ రాయితీకి ఈ–పంట నమోదు తప్పనిసరి. జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్‌లో ఈ– పంట నమోదు ముమ్మరంగా సాగుతోంది.

వరి పంటతో పాటు అపరాలు, మొక్కజొన్న కొనుగోళ్లకు ఈ–పంట నమోదు చేసి ఉండాలి. రైతులు ఏఏ పంటను ఎంత విస్తీర్ణంలో వేశారు, ఎక్కడెక్కడ పంటలు పండిస్తున్నారనే విషయాలను ఇందులో నమోదు చేయాలి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పు డు పంటలు నష్టపోయినా ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదా ఇతర నష్టపరిహారాలు పొందాలన్నా, రాష్ట్ర ప్రభు త్వం వ్యవసాయపరంగా అందించే రాయితీళ్లు, సబ్సి డీలు పొందాలన్నా, రబీ సీజన్‌లో ధాన్యం కొను గోళ్లకు, అపరాల పంటలైన మినుము, ఇతర పంట లు, మొక్కజొన్న పంటలకు సంబంధించి కొనుగోళ్ల విషయంలోను ఈ–పంట నమోదు తప్పనిసరి. ప్రతి రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలని ఇప్పటికే గ్రామాల్లో వ్యవసాయ శాఖాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

1.84 లక్షల ఎకరాల్లో నమోదు పూర్తి

జిల్లాలో ప్రస్తుతం వ్వవసాయ సాగుకు సంబం ధించి 3లక్షల81వేల ఎకరాల విస్తీర్ణం ఉండ గా ఇప్పటి వరకు 1,84,092 ఎకరాల్లో ఈ–పం ట నమోదు పూర్తయింది. జిల్లాలో మొత్తం విస్తీర్ణం 3,91,276 ఎకరాలు. ఇందులో సాగు విస్తీర్ణం 3.81 లక్షలు ఎకరాలు కాగా రబీలో ఎంఏవోలు ఇప్పటి వరకు 3.61 లక్షల ఎకరాలను గుర్తించగా 2.85 లక్షల ఎకరాలను వీఏ ఏలు పరిశీలించారు. ఇందులో ఇప్పటివరకు 1,84,0 92 ఎకరాలకు సంబంధించి ఈ–పంట నమోదు పూర్తయింది. మిగిలిన 2.05 లక్షల ఎకరాలకు ఈ– పంట నమోదు కావాల్సి ఉంది. ఈ–పంట నమోదు కార్యక్రమాన్ని ఈనెల 20వ తేదీ లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. ఈ మేరకు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ–పంట నమోదు చేయించుకోవాలి

దెందులూరు/ చింతలపూడి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రైతులందరూ తప్పని సరిగా ఈ–పంటను నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవ సాయశాఖాధికారి హాబీబ్‌ బాషా అన్నారు. సోమ వరప్పాడులో బుధవారం మండల వ్యవసాయశాఖ అధికారి ఎల్‌.శ్రీనివాస్‌రాజు, ఉద్యానవనశాఖ అధి కారి కరణ్‌ ఆధ్వర్యంలో ఈ–పంట నమోదుపై రైతు లకు అవగాహన సదస్సు నిర్వహించారు. గోపన్న పాలెం, సోమవరప్పాడు వరి పొలాల్లో పర్యటించి ఈ–పంట నమోదు పక్రి యను పరిశీలించారు. అనంతరం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడి మండలంలోని కాంతంపాలెంలోను హబీబ్‌ బాషా పర్యటించారు. రబీలో రైతు ఏ పంట వేశారో ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవడానికి తమ మొబైల్‌లోనే తెలుసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని రైతులకు వివరించారు. గ్రామంలో వరి పంట వేసిన పొలాన్ని ఆయన పరిశీలించి అగ్గి తెగులు లక్షణాలు, నివారణ చర్యలు గురించి వివరించారు. మండల వ్యవసాయాధికారి కె.మురళీకృష్ణ రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:35 AM